11, అక్టోబర్ 2022, మంగళవారం

Telangana Vaibhavam project

 తెలంగాణా వైభవము


తెలంగాణా చారిత్రక ప్రదేశాలు:


1.చార్మినార్                                   2.ఓరుగల్లు కోట


3.వేయి స్తంబాల గుడి                 4.చౌమహల్లా ప్యాలెస్


ప్రదేశం

చరిత్ర


1.చార్మినార్

చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. 

  2.ఓరుగల్లు కోట

ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసారు. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం. కాకతీయ కీర్తితోరణాలు; స్వయంభూశివాలయం; ఏకశిల గుట్ట, గుండుచెరువు;, ఖుష్ మహల్ తదితర దర్శనీయ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి.

3.వేయి స్తంబాల గుడి

వేయి స్తంబాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది.

4.చౌమహల్లా ప్యాలెస్

సలాబత్ జంగ్ దీని నిర్మాణాన్ని 1750 లో ప్రారంభించాడు, ఆసఫ్ జాహ్ 5, ఐదవ నిజాం దీనిని 1857, 1869 మధ్యలో పూర్తి చేసాడు.ఈ నిర్మాణాన్ని టెహ్రాన్ లోని షాహే ఇరాన్ సౌధం యొక్క నమూనాగా భావిస్తారు.ఈ సౌధం తన విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో ప్రారంభింపబడిన దీని నిర్మాణం పూర్తి గావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ కాలంలో నూతన ఒరవడులకు చవిచూసింది. ఈ సౌధంలో రెండు ప్రాంగణాలు వున్నాయి, దక్షిణ ప్రాంగణం, ఉత్తర ప్రాంగణం. వీటిలో సుందర సౌధాలున్నాయి. ఒక ఖిల్వత్ (మహాదర్బారు), నీటి ఫౌంటెన్, ఉద్యానవనాలు ఉన్నాయి.



 తెలంగాణా పండుగలు


1.బతుకమ్మ                           2.బోనాలు


3.సమ్మక్క సారక్క జాతర


పండుగ పేరు


వివరాలు


1.బతుకమ్మ 

బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

2.బోనాలు

బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ,రాయలసీమలోనికొన్నిప్రాంతాలలోజరుపుకోబడుతుంది.సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలోపండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు.


3.సమ్మక్క సారక్క జాతర

సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతరతెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.[1] భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా.











 తెలంగాణా క్రీడలు


1.గిల్లి దండ                        2.కోడిపందెం


2.అష్టాచమ్మా



క్రీడలు

వివరాలు

1.గిల్లి దండ  

గిల్లిదండ "అనేది రెండు పరికరాలతో ఆడుతారు-ఒక దండ, పొడవైన చెక్క కర్ర, మరియు ఒక గిల్లి, ఒక చిన్న ఓవల్ ఆకారపు చెక్క ముక్క. దీనిని నలుగురు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల ఆటగాళ్లతో ఆడతారు. ఒక చిన్న వృత్తంలో నిలబడి, ఆటగాడు గిల్లిని ఒక రాయిపై వంపుతిరిగిన రీతిలో (కొంతవరకు చూసే రంపం లాంటిది) గిల్లి యొక్క ఒక చివర నేలను తాకుతూ, మరొక చివర గాలిలో ఉంటుంది. ఎత్తైన ముగింపు, ఇది గాలిలోకి తిప్పబడుతుంది. అది గాలిలో ఉన్నప్పుడు, ఆటగాడు గిల్లిని కొట్టాడు, వీలైనంత వరకు దాన్ని కొట్టాడు. గిల్లిని కొట్టిన తర్వాత, ఆటగాడు పరుగెత్తి ముందు అంగీకరించిన పాయింట్‌ను తాకాలి ప్రత్యర్థి గిల్లిని తిరిగి పొందడానికి ముందు సర్కిల్


2.కోడిపందెం

కోడిపందెం అనేది రెండు పందెం కోళ్ళ మధ్య నిర్వహించే క్రీడ. ఈ పందేలను ప్రతీ యేటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది.ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్ళు అంటారు. వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. బెట్టింగు జరిగే అవకాశం ఉన్నందున ఈ పందేల నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉండదు.

2.అష్టాచమ్మా

అష్టా-చెమ్మ" దీనినే "గవ్వలాట" అనికూడా అంటారుఈ ఆటలో పాల్గొనే ప్రతీ ఆటగాడికీ వేరే వేరే ఆకారాలు లేదా రంగులున్న నప్పులు ఉంటాయి. ఇక ఈ నప్పులను ఎంత దూరం నడపాలో నిర్ణయించడానికి కావలసినవి గవ్వలు. సాధారణంగా నాలుగు ఒకే పరిమాణం గల గవ్వలను ఆటకు ఉపయోగిస్తారు. ఈ గవ్వలను ఆటగాడు విసిరినప్పుడు ఎన్ని గవ్వలు వెల్లకిల పడితే నప్పు అంత దూరం జరపవలసి ఉంటుంది. నాలుగు గవ్వలూ వెల్లకిల పడితే "చెమ్మ" అనీ, నాలుగూ బోర్లా పడితే "అష్ట" అనీ అంటారు. "చెమ్మ" అంటే నాలుగు, "అష్ట" అంటే ఎనిమిది. ఇవి పడినప్పుడు ఆ ఆటగాడికి మరల గవ్వలు విసిరే అవకాశం ఉంటుంది. కానీ అదే, మూడు సార్లు అష్ట లేదా చెమ్మ పడితే, నప్పును జరిపే అవకాశాన్ని కోల్పోతాడు.





                 Thank you



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu