ఇంధన పొదుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇంధన పొదుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2020, ఆదివారం

ఇంధన పొదుపు

*ఇంధన పొదుపు*

ఇంధనాలు పొదుపు చేద్దాం
అందరము మాట ఇద్దాం
హద్దు మీరి వనరులను
వాడొద్దని చాటిద్దాం

అవసరానికే లైటు,ఫ్యాను,
ఏసి వాడుకుందాం
అధిక నేల బొగ్గు నిల్వ
లట్లే కాపాడుకుందాం
పులుసుకూరలే తిందాం
వేపుళ్లను మానేద్దాం
చన్నీటి స్నానాలతో
కరెంటు,గ్యాసునాదాచేద్దాం

అత్యవసరమైతేనే స్వంత
వాహనాలనురికిద్దాం
అతి ఇంధన వాడకాన్ని
ఆదిలోనె త్రుంచేద్దాం
దిగుమతులను తగ్గించి దేశ
ప్రగతికి బాటలు వేద్దాం

*-రామ్మూర్తి దండె*