11, అక్టోబర్ 2022, మంగళవారం

మహాభారతం(ఆది పర్వం) quiz questions

 మహాభారతం క్విజ్


1. ఆది పర్వము


1. శ్రీ మహాభారతమును సంస్కృతంలో రచించినవారెవరు? 

వేదవ్యాసుడు

2. మహాభారతములోని శ్లోకముల సంఖ్య?

లక్ష 

3. మహాభారతాన్ని మొట్టమొదట తెలుగులో వ్రాసినవారు?

ముగ్గురు. వారు వరుసగా 1) నన్నయ 2. తిక్కన 3. ఎర్రన

4. మహాభారతములోని పర్వాలెన్ని?

మహాభారతములోని పర్వాలు 18

5. నన్నయ్య తెలుగులో ఎన్ని పర్వాలు వ్రాసెను? అవి ఏవి?

నన్నయ్య ఆది, సభాపర్వాలు పూర్తిగా వ్రాసి, అరణ్యపర్వములో 3వ వంతు పూర్తి చేసాడు.

6. తిక్కన మహా భారతములో ఎన్ని పర్వాలు వ్రాసాడు ? విరాటపర్వం నుండి సర్గారోహణ పర్వము వరకూ (15 పర్వాలు)

7. మత్స్యగ్రంధి అనే పేరు ఆమెకు ఎలా వచ్చింది?

చేపకు పుట్టడం చేత ఆమె నుండి పొలుసు వాసన రావడం చేత 

8. వశిష్ట మహర్షి మనుమడి పేరు? 

పరాశర మహర్షి

9. సత్యవతికీ, పరాశరమహర్షికి జన్మించినవాడు?

కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు)

10. కృష్ణద్వైపాయనుడనే పేరు వ్యాసునికి ఎందుకు వచ్చింది? 

నల్లని వర్ణముతో, నదీ ఇసుక దిబ్బలపై జన్మించుట (ద్వైపాయనుడు) చేత 

11. మహాభారతము అసలు పేరేమిటి? 

జయ సంహిత

12. వేదాలను వ్యాసుడు ఎన్నిగా విభజించాడు? అవి ఏవి?

వేదాలను వ్యాసుడు నాలుగింటిగా విభజించాడు అవి (1) ఋగ్వేదము (2) యజుర్వేదము (3) సామవేదము (4) అధర్వణ వేదము. 

13. కురువంశానికి మూలపురుషుడు ఎవరు? 

ఉపరిచర వసువు

14. కురువంశానికి ఆ పేరు రావడానికి కారకుడెవరు? అతని విశిష్టత ఏమి? 

కురుమహారాజు. అతడు నూరు అశ్వమేధయాగాలు చేసాడు.

15. వసుంధర అనగా అర్థం?

బంగారము ధరించినది (భూదేవి)

16. దుష్యంతుడు ఏ వంశీయుడు? 

కురువంశీయుడు.

17. కణ్వమహర్షి పెంచిన బాలిక పేరు?

శకుంతల

18. దుష్యంతుని తండ్రి పేరేమి?

ఇలమహారాజు

19. పూర్వం నైమిశారణ్యంలో శౌనకాదిమునులు చేసిన యాగం పేరేమి? 

దీర్ఘ సత్రయాగం

20. దీర్ఘ సత్రయాగం ఏదేవుని గురించి శౌనకాది మునులు చేసారు?

విష్ణుమూర్తి గురించి

21. ఎఱ్ఱన భారతములో ఎన్ని పర్వాలు వ్రాసాడు?

అరణ్య పర్వంలో అర్థ భాగం(½ పర్వం) 

22. సూత మహర్షి ఎవరి శిష్యుడు?.

వ్యాసమహర్షి

23. మహాభారతమును శౌనకాది మునులకు ఎవరు చెప్పిరి?

సూత మహర్షి

24. జనమేజయ మహారాజుకు మహాభారతమును ఎవరు చెప్పిరి?

వైశంపాయనుడు

25. దాశరాజుకు వసురాజు ఇచ్చేసిన ఆడబిడ్డ పేరు?

సత్యవతి

26. సత్యవతికి గల మరొక పేరు?

మత్స్య గ్రంథి

27. అంగీరసుని కుమారుడు ఎవరు?

బృహస్పతి

28. నహుషుని కుమారుడెవరు?

యయాతి

29. యయాతి ఎవరిని పెండ్లాడెను?

దేవయాని 

30. వృషపర్వుడెవరు?

రాక్షసరాజు

31. వృషపర్వుని కుమార్తెపేరు?

శర్మిష్ఠ

32. దేవయాని, యయాతిల సంతానం?

1. యదు 2. తుర్వసుడు

33. యయాతిల సంతానం? 

1.దృహ్యుడు 2. అనువు 3. పూరువు

34. తండ్రి ముసలితనమును తాను స్వీకరించి, తన యవ్వనమును తండ్రికి దారబోసిన త్యాగశీలి?

పూరువు

35. కురువంశమునకు మరొకపేరు?

పూరువంశము 

36. ప్రతీపుడి కుమారుల పేర్లు?

1. దేవాపి 2. శంతనుడు 3. బాహ్లికుడు.

37. శంతనుడి మొదటి భార్య ఎవరు?

గంగాదేవి

38. శకుంతల తల్లిదండ్రులు?

తల్లి మేనక, తండ్రి విశ్వామిత్రుడు

39. శకుంతలకు ఆపేరు ఎందుకు వచ్చింది? పసితనములో శకుంతలను పక్షులు రక్షించినందున

40. శకుంతల, దుష్యంతులు చేసుకొన్న వివాహమునేమందురు?

గాంధర్వ వివాహము

41. శకుంతల కుమారుని పేరేమి?

సర్వదమనుడు 

42. కురు వంశీయులు ఏ వంశమువారు?

చంద్ర వంశం వారు

43. సర్వదమనుడికి దుష్యంతుడు పెట్టిన పేరేమిటి?

భరతుడు 

44. రాక్షసుల గురువు పేరేమిటి?

శుక్రాచార్యుడు. 

45. దేవతల గురువు పేరేమిటి?

బృహస్పతి

46. దేవతలు, రాక్షసులు ఏమహర్షి కుమారులు?

కశ్యపమహర్షి 

47. రాక్షసులను ఏవిద్యతో శుక్రుడు బ్రతికించేవాడు?

మృతసంజీవినీ విద్య

48. శుక్రుని కుమార్తె పేరు? 

దేవయాని

49. బృహస్పతి కొడుకు పేరు? 

కచుడు

50. గంగకు పుట్టిన పిల్లలు ఎవరు?

అష్టవసువులు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu