11, అక్టోబర్ 2022, మంగళవారం

తరగతి: IX Lesson plan

 



తరగతి: IX నెల: జనవరి విషయం: చెలిమి కాలాంశము: 8


శీర్షిక

చెలిమి

బోధనా పద్ధతి

ప్రశ్నోత్తర పద్ధతి

బోధనోపకరణాలు

యయాతి చరిత్ర మూల గ్రంధం, పొన్నిగంటి తెలగన కవి పరిచయం, నల్ల బల్ల, పాఠ్య పుస్తకం మొదలగునవి.

ఉద్ధేశము

స్నేహం గొప్పతనం తెలియజేయడం.

పాఠ్యభాగ సారాంశము

శర్మిష్ఠ, దేవయానిల మధ్య బట్టల విషయమై గొడవ జరగడం, ఎవరి ఆభిజాత్యాన్ని వారు ప్రదర్శించడం, కోపతాపాలతో శపించుకోవడం, దేవయానిని బావిలో తోయడం, యయాతి దేవయానిని కాపాడుట ఇందులో సారాంశము.

పూర్వ జ్ఞాన పరిశీలన

  1. చెలిమి అంటే ఏమిటి?

  2. స్నేహం వల్ల లాభాలేమిటి?

  3. స్నేహితులకుండవలసిన లక్షణాలేమిటి?

ఉన్ముఖీకరణం

  1. మీరు ఇంటికెళ్ళాక ఎవరితో ఆడుకుంటారు?

  2. మీరు ఎక్కువగా ఎవరితో గడపడానికి ఇష్టపడతారు?

భాషాజ్ఞానము

అచ్చతెలుగు పదాల పరిచయం ఏర్పడుతుంది.

ప్రకృతి-వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు ఎన్నోనేర్చుకుంటారు.

కఠిన పదాలు

ఒజ్జ, వివాదం, కేరడం, ఎలనాగ, ఉసురు, వాయి, కినుక.

సంధులు

యడాగమ, సరళాదేశ, ఉకార, త్రిక సంధులు.

పర్యాయ పదాలు

అసురులు, ఒజ్జ, కూతురు, అతివ.

ప్రకృతి-వికృతులు

ఉపాధ్యాయుడు-ఒజ్జ, రాజు-రేడు, స్నేహము-నెయ్యము, రాజ్ఞి-రాణి.

లక్ష్యాలు-స్పష్టీకరణాలు:


జ్ఞానము-అవగాహన

జీవితంలో స్నేహము యొక్క ప్రాముఖ్యత ఎంతుందో విద్యార్థులు అవగాహన చేసుకుంటారు.

నైపుణ్యము

పద్య పఠన నైపుణ్యం అలవడుతుంది.

విశ్లేషణ

మంచి చెడు స్నేహాల ప్రభావము మనిషిపై ఎలా పనిచేస్తుందో విశ్లేషించుకుంటారు.

పునశ్చరణ

  1. ఈ పాఠంలోని రాజు పేరేమిటి?

  2. రాక్షసుల గురువు ఎవరు?

  3. శుక్రాచార్యుని కూతురెవరు?

  4. వృషపర్వుని కూతురు పేరేమిటి?

  5. దేవయాని, శర్మిష్ఠలలో మంచి స్నేహ లక్షణాలున్నది ఎవరికి?

జీవన విలువలు

స్నేహం గొప్పతనం తెలుసుకొని మంచి స్నేహితుకు దగ్గరవ్వాలి, జీవితం ధన్యం చేసుకోవాలి.

మూల్యాంకనం

  1. స్నేహితులకుండవలసిన మంచి లక్షణాలేమిటి?

  2. స్నేహ ధర్మానికి విఘాతం కలిగించిందెవరు.

  3. స్నేహితుల మధ్య గొడవలు ఎందుకొస్తాయి.

  4. స్నేహబంధాన్ని వివరించే కథను రాయండి.

  5. పావురాల కథ, కాకి జింక తాబేలు ఎలుకలకు సంబంధించిన కథ రాయండి.


ఇంటిపని

  1. చెలిమి పాఠంలోని కథాంశాన్ని వివరించండి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్