11, అక్టోబర్ 2022, మంగళవారం

ద్విరుక్తటకార సంధి:

 ద్విరుక్తటకార సంధి:       

               

సూత్రం: 'కుఱు, చిఱు, కడు, నడు, నిడు' శబ్దముల ' ఱ-డ' ల కచ్చు పరంబగునప్పుడు ద్విరుక్తటకారoబగు.                     

పద వివరణ: కురు, చిరు, కడు, నడు, నిడు=కురు, చిరు, కడు, నడు, నిడు అనే.                     

శబ్దములు=పదములు 

ఱ-డ లు=ఱ డ అనే అక్షరములు

అచ్చు="అ" నుండి "ఔ" వరకు గల అక్షరాలు                                 

పరమగుట=సంధి లో రెండవ పదము గా వచ్చుట                     

సూత్ర అర్థం:- సంధి లోని మొదటి పదము కుఱు, చిఱు, కడు, నడు, నిడు అనే పదాలలో ఏదో ఒకటి  ఉండి, దానికి రెండవ పదము లో మొదటి అచ్చు పరముగా ఉంటే, ఆ మొదటి పదాలలోని ఱ, డ అనే చివరి అక్షరాలకు ద్విరుక్తటకారం అంటే, ట్ట అనే అక్షరం ఆదేశంగా వస్తుందని సూత్రార్థం.                                  

ఉదాహరణ

1.కుఱు+ఉసురు=కుట్టుసురు

2. చిఱు + అడవి=చిట్టడవి   

3. కడు + ఎదురు=కట్టెదురు

4. నడు + ఇల్లు=నట్టిల్లు

5. నిడు + ఊర్పు=నిట్టూర్పు     

సమన్వయం:- 

కురు+ ఉసురు - అన్న పై ఉదాహరణలో కురు అనేది పూర్వ పదం. 

అది కురు, చిరు, కడు, నడు, నిడు అనే పదాల లోనిది. దానికి ఉసురు అనే పదం లో మొదట 'ఉ' అనే అచ్చు పరంగా ఉంది. కాబట్టి  పై సూత్రాన్ని అనుసరించి మొదటి పదములోని 'ర' అనే అక్షరం స్థానములో ద్విత్వ టకారం("ట్ట") ఆదేశముగా వచ్చి కుట్టు+ఉసురు= కురు+ఉసురు అనే రూపం ఏర్పడింది.

ఇట్లే మిగిలిన ఉదాహరణలు కూడా    

చిట్టెలుక, కట్టెదురు ,నట్టిల్లు, నిట్టూరుపు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu