ధర్మార్జునులు
1. ధర్మార్జునులు పాఠ్యభాగం రచించింది ఎవరు?
A) చేమకూర వేంకట కవి
2. ధర్మార్జునులు పాఠం ఉద్దేశం ఏమిటి?
A) ధర్మరాజు అతని సోదరుల గుణగణాలను తెలపడం
3. నేపథ్యం అంటే ఏమిటి ?
A) పూర్వకథను తెలియజేసేది
4. ధర్మార్జునులు ఏ పుస్తకం నుండి తీసుకున్నాము?
A)విజయవిలాసం
5. పాండవుల రాజధాని పేరు ఏమిటి?
A) ఇంద్రప్రస్థ పురం
6. ధర్మార్జునుల పాఠం ఈ ప్రక్రియకు చెందినది?
A) ప్రబంధం
7. అర్జునుని భార్యల పేర్లు ఏమిటి?
A) ద్రౌపది, చిత్రాంగద, ఉలూచి, సుభద్ర
8. ప్రబంధం అంటే ఏమిటి?
A) 18 రకాల వర్ణనలు ఉంటాయి. వర్ణనా ప్రధానమైనది.
9. చేమకూర వేంకట కవి బిరుదు ఏమిటి?
A) ప్రతిపద్య చమత్కారచణుడు
10. చేమకూర వెంకట కవి ఎవరి ఆస్థాన కవి?
A) రఘునాథ నాయకుని ఆస్థాన కవి
11. విజయ విలాసం ఎవరికి అంకితం ఇవ్వబడింది.
A) రఘునాథ నాయకునికి
12. చేమకూర వేంకట కవి ఏ శతాబ్దానికి చెందిన వాడు?
A) 17వ శతాబ్దం
13. ధర్మరాజు ఎవరి వరపుత్రుడు?
A) యమధర్మరాజు
14. ధర్మరాజుకు ఆభరణాలు ఏవి?
A) శాంతి, దయ
15. మొకమిచ్చకపు మెచ్చు అంటే ఏమిటి?
A) అవసరం కోసం పొగడడం
16. మర్యాదకు వ్యతిరేక పదం వ్రాయండి.
A) అమర్యాద
17. పాండురాజు జ్యేష్ఠ కుమారుడు ఎవరు?
A) ధర్మరాజు
18. జ్యేష్ఠ కుమారుడు అంటే ఏమిటి?
A) పెద్ద కుమారుడు
19. ధర్మరాజుకు రాత్రి పగలు ఎం సంపాదించాలి అనే కోరిక ఉంది?
ఆ) ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించడం
20. “జలధి వలయిత వసుమతీచక్ర మెల్ల” అర్థం ఏమిటి?
A. సముద్రంచే ఆవరించబడిన ఈ భూమండలం అని అర్ధం.
21. కొంగు బంగారం అంటే ఏమిటి?
A) కొంగున మూటగట్టిన బంగారం/సులభంగా తీసుకోదగినది
22.ఈశ్వరుడు ఐదు ముఖాలతో పాండవులను ఎందుకు పోల్చాడు?
A లోకాన్ని శుభకరంగా ఉంచడం మూలంగా
23. పాండవులు ఐదు దేవతా వృక్షాలతో ఎందుకు పోల్చాడు?
A కోరిన కోరికలు తీర్చడం వల్ల
24.పాండుకుమారులు ఎందరు?
A ఐదుగురు అన్నదమ్ములు. యుధిష్ఠిరుడు, భీమా, అర్జున, నకుల, సహదేవ
25.ఇంద్రుని కుమారుడి పేరు ఏమిటి?
A జయంతుడు
26.విష్ణువు ధ్వజములో (జెండా ) ఎవరి చిత్రం ఉంటుంది?
A గరుడ పక్షి
27.పార్వతి దేవి ఎవరి పుత్రిక?
A పర్వత రాజు
28.అర్జునుడిని జయంతుని తుమ్ముడితో, శ్రీ కృష్ణుడి ప్రాణమిత్రుడితో, శివునికి సమానమైనవారితో ఎందుకు పోల్చాడు?
A అందంలో జయంతుని తమ్ముడితో , దయాగుణంలో శ్రీ కృష్ణుడి ప్రాణమిత్రుడితో, యుద్ధవిజయాలతో శివుని సమానమైనవాడితో పోల్చాడు.
29.అర్జునుడికి భూమి మీద సాటివచ్చే వీరుడు ఎవరు?
A రఘురాముడు
30.ప్రబంధానికి కథను ఎక్కడినుండి తీసుకుంటారు ?
A ఇతిహాస పురాణాల నుండి
31. వర్ణనా ప్రధానమైన కావ్యం పేరు ఏమిటి?
A చేమకూర వేంకట కవి రాసిన - విజయవిలాసం, సారంగధర చరిత్ర
32.యథా రాజా తథాప్రజా అంటే ఏమిటి?
A రాజు ఎలా ఉంటె ప్రజలు అలాగే ఉంటారు
33.బుధులు అంటే ఎవరు
A పండితులు
34.విజయవిలాసం (ధర్మార్జునులు) ప్రబంధానికి కథను ఎక్కడినుండి తీసుకున్నారు?
A మహాభారతం
35.విజయవిలాసం ప్రత్యేకత ఏమిటి?
A ప్రతిపద్య చమత్కారం
36. విజయవిలాసం ఎలాంటి పేరును పొందింది?
A పిల్లవసు చరిత్ర
37.చేమకూర వేంకట కవి ఎవరి పుత్రుడు?
A లక్ష్మణామాత్య పుత్రుడు
38. ఎన్ని యుగాలు ఉన్నాయి? వాటి పేర్లు రాయండి?
A 1.కృతా - ప్రహ్లాదుడు
2.త్రేతా - రాముడు
3.ద్వాపర - పాండవులు
4. కలి - ప్రస్తుతం
39. పాండురాజు భార్య పేరు ఏమిటి?
A కుంతి
40. పాండవుల గుణాలు ఏవి?
A స్నేహభావం, భక్తి, ప్రేమ, సహనం
41.ధర్మరాజును కృత లక్షణుడు అని ఎందుకు అన్నారు?
A సందిగ్ధ లక్షణాలు లేనివాడు/ మంచి లక్షణాలే ఉన్నవాడు
నేనెరిగిన బూర్గుల
1.అభినందన వ్యాస ప్రక్రియ అంటే ఏమిటి?
A)గొప్ప వారి వ్యక్తిత్వాన్ని పొగుడుతూ రాసిన వ్యాసం
2.పి వి గారి పూర్తి పేరు ఏమిటి?
A. పాములపర్తి వేంకట నరసింహారావు
3.పి వి గారి రాజకీయ గురువు గారు ఎవరు?
A. స్వామి రామానంద తీర్థ
4.పి వి గారు ఎన్ని భాషలలో మాట్లాడగలరు?
A. 17 భాషల్లో
5.పి వి గారి ఏ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది?
A. విశ్వనాథ సత్యనారాయణ గారి "వేయిపడగల" నవలను హిందీలోకి "సహస్రఫన్" పేరుతో అనువదించినందుకు
6.పి వి గారి ఆత్మకథ పేరేంటి?
A.ది ఇన్సైడర్ (లోపలి మనిషి)
7.పి వి రాసిన అబలా జీవితం దేనికి అనువాదం?
A ఫన్ లక్షత్ కొన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి
8.పి వి గారు జన్మించిన, మరణించిన సంవత్సరాలు?
A 1921-2004
9.భారత దేశ ఆర్ధిక సంస్కరణల పితామహులు ఎవరు?
A. పీవీ గారు
10. వర్ధంతి అంటే ఏమిటి?
A. చనిపోయిన రోజు
11.బూర్గుల రామకృష్ణా రావు గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు?
A హైదరాబాద్ రాష్ట్రం
12.బూర్గుల వారి పొట్టితనం తెలిపే సంఘటనలు ఏవి?
A. 1) అమెరికా రాయబారి ప్రొఫెసర్ గాల్ బ్రైత్ మరియు డాక్టర్ రామకృష్ణా రావు గారిని ఫోటో తీయడం
2) అరేబియా రాజు ఇబన్ షా ఉద్ ను పుష్పమాలాలంకృతినిగా చేయడం
13.బూర్గుల వారిని విష్ణుమూర్తి ఏ అవతారంతో పోల్చారు?
A. వామనావతారం
14.బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులుగా భావించినది ఎవరు?
A. పీవీ నరసింహారావు
15. జాగీర్దార్ వ్యవస్థ అంటే ఏమిటి?
A.భూమి మొత్తం ఒక కుటుంబం చేతి లో ఉండడం
16.కౌలుదారీ చట్టం అంటే ఏమిటి?
A దున్నేవారికే భూమి హక్కును ఇచ్చే చట్టం
17. హైదరాబాద్ సంస్థానవిచ్ఛిత్తి అంటే ఏమిటి?
A హైదరాబాద్ రాష్ట్రం విడగొట్టడం
18. స్వస్తివాచకం పలకడం అంటే ఏమిటి?
A ముగింపు పలకడం
19. శరాఫత్ అంటే ఏమిటి?
A సౌజన్యానికి మారుపేరు, మంచితనం.
20. బూర్గుల వారు బహుముఖ ప్రజ్ఞ కలవాడు అని ఎలా చెప్పవచ్చు?
A బూర్గుల వారు న్యాయవాదిగా, ఉద్యమకారునిగా, బహుభాషావేత్తగా బహుముఖ ప్రజ్ఞ కలవాడు అని చెప్పవచ్చు
21. బూర్గుల వారికి కష్టాలు వచ్చినప్పుడు ఏమి అనే వాడు?
A “సరే - అవన్నీ ఆటలో ఉండేవేగా”
22. ఒక మాటల్లో చెప్పాలంటే బూర్గుల వారిని ఏమి అని అనవచ్చు?
A పూర్ణపురుషులు అని అనవచ్చు
23. సమ్యక్ దృష్టికోణంలో ఆలోచించడం అంటే ఏమిటి?
A మంచి దారిలో నడవడం
24. పీవీ గారి మీద ఎవరు కారాలు మిరియాలు నూరుతూ ఉండేవారు?
A పీవీ గారి సీనియర్ గుమాస్తా
వలస కూలి
1.వలస కూలి కవిత కవి ఏ సందర్భంలో నుండి రాసారు
A 1977 లో తూర్పుతీరప్రాంతానికి వలస వెళ్లిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫాన్కు గురువై, తిరిగిరాలేదని వాలెక్కడున్నారో జాడాతెలియనప్పుడు, కవి ఈ సందర్భం తీసుకొని రాసారు
2. వలస కూలి ఏ ప్రక్రియకు చెందినది
A గేయం ప్రక్రియ
3. గేయం అంటే ఏమిటి
A పల్లవి చేరనాలతో కూడి పాడుకోవటానికి వీలుగా ఉండేది గేయం
4. వలస కూలి పాఠం ఈ పుస్తకం నుండి రాసారు
A డా|| ముకురాల రామారెడ్డి "హృదయశైలి" గేయ సంకలనం
5. డా||ముకురాల రామారెడ్డి జన్మించిన, మరణించిన సంవత్సరాలు ఏవి
A 1929-2003
6. ఆయన జన్మించిన ప్రాంతం ఏమిటి
A నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం
7. ఆయన రచనలు ఏవి
A మేఘదూత, దేవరకొండ దుర్గం, నవ్వేకత్తులు, హృదయశైలి, రాక్షసజాతర, ఉపరిశోధన, తెలుగు సాహిత్యనిఘంటువు, ప్రాచీన తెలుగుకవిత్వంలో కవితాత్మక భావపరిణామం
8. డాక్టర్ రేట్ కోసం ఆయన రాసిన పరిశోధన గ్రంధం ఏది
A ప్రాచీన తెలుగుకవిత్వంలో కవితాత్మక భావపరిణామం
9. డా|| ముకురాల రామారెడ్డి జాతీయ కవిగా ఎవరు గుర్తింపు ఇచ్చారు
A ఆకాశవాణి ఢిల్లీ వారు 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేసారు
10. కోస్తదేశం అంటే ఏమిటి
A ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీర ప్రాంతం
11. లేబారి అంటే ఏమిటి
A కూలి వారు
12. జాలరి అంటే ఏమిటి
A చేపలు పట్టేవారు
13. గోకులాష్టమి అంటే ఏమిటి
A శ్రీ కృష్ణుడు జన్మించిన 8వ తిథి
14. "గొడ్లదోక్కలు గుంజినా" అంటే ఏమిటి
A పశువులు తినడానికి గడ్డి కుడా లేని స్థితి
15. కోడిమెలూ, గాలాలు, నాజాకాతు నైలాను దేనికి వాడుతారు
A చేపలు పట్టడానికి
16. కోస్తా ప్రాంతం చేపల రకాలు ఏవి
A మెరిగె, బొచ్చె
17. మంచి నీటి చేప రకాలు ఏవి
A చందమామల, పరక పిల్లలు
18. చేపలు పట్టేవారిని ఏమంటారు
A బెస్తవారు, జాలరి
19. కార్తీకపున్నం ప్రత్యేకత ఏమిటి?
A కార్తీక మాసం లో వచ్చే పౌర్ణమీ నాడు ఉసరి ఆకులు వేసుకుని స్నానం చేస్తారు, నది స్నానాలు చేస్తారు . ఏది అక్టోబర్ నవంబర్ వస్తుంది
20. జలపిడుగు అని కవి దేనిని అన్నాడు
A గోదావరి నదిలో వచ్చిన వరదాలోను
21. భద్రాచలం , శ్రీ రామాలయం ఎక్కడ ఉంది
A ఖమ్మం జిల్లా గోదావరి ఒడ్డున ఉంది
22. మెహబూబ్ నగర్ లో ప్రవహించిన ముఖ్యమైన నది ఏది?
A కృష్ణ నది
23. మన్నెంకొండ దేవుడు ఏ జిల్లాలో ఉంది
A మహబూబ్ నగర్ జిల్లా వేంకటేశ్వరస్వామి
1. ఇంటర్వ్యూ అంటే ఏమిటి?
ఒకరు ప్రశ్నలు వేస్తే మరొకరు సమాధానం చెప్పడం
2. దాశరధి రంగాచార్య పుట్టిన చనిపోయిన సంవత్సరాలు
1928-2015
3. దాశరధి రంగాచార్య పుట్టిన ఊరు
మహబూబాబాబ్ జిల్లా చిన్నగురు
4. ఆయన సోదరూడి పేరు ఏమిటి
5. తెలుగు నవలలో మొదటగా వీరు ప్రవేశపెట్టినది ఏది
పాత్రోచితయాస.
6. రంగాచార్య గారి రచనలు పేరులు ఏవి
వీరి రచనలలో మొదట చిల్లరాదేవుళ్లు తరువాత జానపదం మోదుగుపూలు జీవనయానం
7. వీరు రాసిన ఏ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడెమిక్ అవార్డు లభించింది
చిల్లరదేవుళ్లు
8. వీరి రచనలలో నేపథ్యం ఏమిటి
తెలంగాణ జనజీవితం, రైతాంగ పోరాటం
9. వీరు రచనలు చేయడానికి కారణం ఏమిటి
ఆంద్ర మహాసభ మహోద్యమం
10. వీరి కంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాసిన వారు ఎవరు
వట్టికోట ఆళ్వారుస్వామి
11. వరదాచార్యకు దాశరధి గారులకు ఏ బిరుదు ఇచ్చారు
రంగాచార్యకు గద్య దాశరధి
వరదన్నాకు పద్యధాశరధి
12. జానపదం నవలలో నేపథ్యం ఏమిటి
దొరలు భూములను ఆక్రమించడం గురించి
13. వీరి ఆత్మకథ పేరు ఏమిటి
జీవనయానం
14. వీరి ఆత్మకథ లాంటి నవల ఏమిటి
మోదుగపూలు
15 "సిదాంతంకన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కన్నా కర్తవ్యం గొప్పది" అనే ఏ నవలలో రాసారు
మోదుగుపూలు
16 పై అర్ధం ఇచ్చే గాంధీగారి నినాదం (డు ఓర డై 1942) వీరిని ప్రభావితం చేసినది ఎవరు
కమ్యూనిస్ట్ ఉద్యమం
17 అధ్యయన అంటే ఏమిటి
తెలుసుకోవడం లేదా చదవడం
18 రంగాచార్య గారు తన జీవితం ద్వారా ఏ సందేశం ఇచ్చారు
ఆవేశం, ఆదర్శం , అక్షరం
19. తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏమిటి
భూస్వాములు, దొరలు నిజాం పోరాటం పై రైతులు జరిపిన పోరాటం (1946-1951)
20. రంగాచార్యతో ముఖాముఖీ పాఠం ఉదేశం ఏమిటి?
తెలంగాణ పోరాటంలో కవులు ఎలా పాల్గొన్నారో తెలియజేయడం
21. ఇంటర్వ్యూ మరొక్క పేరు ఏమిటి
ముఖాముఖి, పరిపృచ్చ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి