4.బతుకమ్మ పండుగ
చిన్న ప్రశ్నలు
1.బతుకమ్మ పండుగ పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు?
జ:-తిగుళ్ళ వేంకటేశ్వర శర్మ
2.టపాకాయలు ఏ పండుగ సందర్భంగా కాలుస్తారు?
జ:-టపాకాయలు దీపావళి పండుగ సందర్భంగా కాలుస్తారు.
3.ఏ పండుగ తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతీకగా నిలిచింది?
జ:-బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతీకగా నిలిచింది.
4.బతుకమ్మ పండుగ పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
జ:-బతుకమ్మ పండుగ పాఠం గేయ ప్రక్రియకు చెందినది.
5. తెలంగాణలోనే తొలి బాలగేయ సంపుటి ఏది?
జ:- 'వానకారు' తెలంగాణలోనే తొలి బాలగేయ సంపుటిగా పేరు పొందింది.
6.బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది?
జ:-దసరా కన్న పదిరోజుల ముందు బతుకమ్మ పండుగ వస్తుంది.
7.బతుకమ్మ ఆట చూడటానికి ఎవరెవరు వస్తారు?
జ:-బతుకమ్మ ఆట చూడటానికి పిల్లలు, పెద్దలు, ఊరి జనమంతా వస్తారు.
8.ఏ బతుకమ్మతో బతుకమ్మ పండుగ పూర్తవుతుంది?
జ:-చద్దుల/సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ పూర్తవుతుంది.
9.బతుకమ్మలు ఎలా ఉన్నాయి?
జ:-బతుకమ్మలు బోర్లించిన బొంగరాలవలే, గుడి కిందకు వచ్చిన గోపురాలవలె ఉన్నాయి.
10.బతుకమ్మలు నీళ్ళలో ఏవిధంగా వెళ్తుంది?
జ:-బతుకమ్మ నీళ్ళలో పడవలాగా వెళ్తుంది.
స్వీయరచన
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. బతుకమ్మలను ఎలా పేరుస్తారు ?
జ:- మగవాళ్ళు బతుకమ్మ పండుగకు ముందురోజు రకరకాల పూలను తెంపుకొస్తారు. ఆ రంగు రంగుల పూలను చిన్న చిన్న కట్టలుగా కట్టి, వరుసగా పెట్టుకుంటారు. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని, పూల కట్టలు విప్పి, అందులో ఒక్కొక్క పూవును వరుసగా పేరుస్తూ, స్త్రీలు బతుకమ్మలను తయారు చేస్తారు.
2. బతుకమ్మ పండుగ పిల్లలకు ఏ విధంగా సంతోషాన్నిస్తుంది?
జ:- పిల్లలంతా గుంపులుగా వెళ్ళి పూలు కోసుకొస్తారు. బతుకమ్మ పేరుస్తున్నప్పుడు పూలు తెంపుతూ ఆడవారికి అందిస్తారు. ఆడవారంతా బతుకమ్మ ఆడుతుంటే పిల్లలు చిత్తుడు గొట్టాలతో చిన్న చిన్న కాగితపు ముక్కలను చిమ్ముతుంటారు. బతుకమ్మలను నీళ్ళలో సాగనంపుతూ, చెరువు నీళ్ళను దోసిళ్ళతో ఎగతోడుతారు పిల్లలు. ఈ విధంగా ఈ బతుకమ్మ పండుగ పిల్లల్లో సంతోషాన్ని నింపుతుంది.
3. బడి దగ్గర బతుకమ్మలు ఎలా కన్పిస్తున్నాయని కవి చెప్పాడు ?
జ:- బడి దగ్గర వీధిలో ఉంచిన బతుకమ్మలు బోర్లించిన బొంగారాలవలె, గుడి కిందకు వచ్చిన గోపురాల వలె కన్పిస్తున్నాయని కవి చెప్పాడు.
4. బతుకమ్మ ఆట ఎలా ఆడుతారు ?
జ:-రంగు రంగుల పూలను సేకరించి, గిన్నెలో స్త్రీలు బతుకమ్మలను పేరుస్తారు. పేర్చిన బతుకమ్మలను వీధిలో ఉంచి, పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ ఆడుతారు.
(ఆ) కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబును రాయండి..
1. బతుకమ్మ పండుగ విశేషాలను సొంతమాటల్లో రాయండి.
జ:-బతుకమ్మ పండుగ, దసరా కన్నా పదిరోజుల ముందే వస్తుంది. ఇది ఆడవాళ్ళకు ముఖ్యమైన పండుగ అయినప్పటికీ మగ పిల్లల పాత్ర అధికంగా ఉంటుంది. రంగు రంగుల పూలను సేకరించి గిన్నెలో కాని పళ్ళెంలో కాని స్త్రీలు బతుకమ్మలను పేరుస్తారు. పేర్చిన బతుకమ్మలను వీధిలో ఉంచి, పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ చప్పట్లను చరుస్తూ ఆడుకుంటారు. ఈ బతుకమ్మ ఆట చూడటానికి పిల్లలు, పెద్దలు, ఊరి జనమంతా వస్తారు. చద్దుల బతుకమ్మనాడు శ్రద్ధతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేరుస్తారు. ఈ బతుకమ్మలు బోర్లించిన బొంగరాలవలె, గుడి కిందకు వచ్చిన గోపురాల వలె కన్పిస్తాయని కవి వర్ణించి చెప్పాడు. చద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ పూర్తవుతుంది. చీకటి పడే వరకు బతుకమ్మలు ఆడుకొని సంతోషంగా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మలను నీళ్ళలో సాగనంపుతూ చెరువు నీళ్ళను దోసిళ్ళతో ఎగతోడతారు పిల్లలు. నీటి అలల మీద తేలియాడుతూ మెల్లగ సాగే బతుకమ్మలు పడవల్లాగా ప్రయాణిస్తాయి. బతుకమ్మ పండుగ ఊరు ఊరంతా సంతోషాన్ని నింపుతుంది.
III. భాషాంశాలు
అ) అర్థాలు
1.ఎక్కువ
2.స్త్రీ
3.ఉత్సవం
ఆ) పర్యాయపదాలు
1.పండుగ,పర్వము
2.తరంగాలు,అలలు
3.నిత్యము, ప్రతిదినము
ఇ) వేరుగా ఉన్న పదం
1.లడ్డూ
2.మిఠాయి
3.సెల్ ఫోన్
4.చెట్టు
ఈ)
1.సంక్రాంతి
2.ఓనం
3.రంజాన్
4.బక్రీద్
5.మొహర్రం
6.దసరా
7.రాఖీ
8.శివరాత్రి
9.శ్రీరామనవమి
10.క్రిస్టమస్
వ్యాకరణాంశాలు
అ) విభక్తి ప్రత్యయాలు
1.కి
2.తో
3.వలన
4.లో
5.కొరకు
ఆ) భాషాభాగాలు
1.క్రియ
2.నామవాచకం
3.విశేషణం
4.సర్వనామం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి