11, అక్టోబర్ 2022, మంగళవారం

aikamatyam 9th class 3rd Language Telugu

 ఐకమత్యం


చిన్న ప్రశ్నలు:

  1. ఆపదలు వస్తే ఎలా బయటపడాలి?

జ:- ఆపదలు వస్తే సమయస్ఫూర్తితో ఆలోచించి బయటపడాలి.

  1. సంభాషణ ప్రక్రియ అంటే ఏమిటి?

జ: సంభాషణ అంతే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు.

  1. ఐకమత్యం పాఠ్యభాగం ఎక్కడి నుండి తీసుకున్నారు?

జ:- చిన్నయసూరి రాసిన మిత్రలాభం కథకు సంభాషణ రూపమే ఈ పాఠం.

  1. పావురాల రాజు ఎవరు?

జ:- పావురాల రాజు చిత్రగ్రీవుడు.

  1. కాకులు దూరని కారడవి అంటే ఏమిటి?

జ:- పెద్ద చెట్లతో కూడిన దట్టమైన అడవి అని అర్థం.

  1. అడవిలోకి నూకలు ఎలా వచ్చాయి?

జ:- అడవిలోకి నూకలు వేటగాడు తెచాడు.

  1. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఏమిటి?

జ:- జరగాల్సింది జరిగిపోయాక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లాభం లేదని అర్థం.

  1. గడ్డిపరకలన్నీ కలిసి ఏనుగును ఎలా బంధించగలుగుతాయి?

జ:- గడ్డి పోచలన్నీ కలిపి తాడులా పేనితే అది దృఢంగా తయారవుతుంది.

  1. హిరణ్యకుడు ఎక్కడ నివసించేవాడు?

జ:- గండకీ నది తీరంలో ఒక కలుగులో నివసించేవాడు.

  1. హిరణ్యకుడి పళ్ళు ఎలాంటివి?

జ:- హిరణ్యకుడనే ఎలుక పళ్ళు చాలా సున్నితమైనవి.



  1. అడవిలో కనిపించిన నూకలకు ఎందుకు ఆశ పడకూడదని చిత్రగ్రీవుడు అన్నాడు?

జ:- పావురాలు కాకులు దూరని కారడవి పైన ప్రయాణిస్తున్నారు. ఆ అడవి చాలా ప్రమాదకరమైనది. అలాంటి దట్టమైన అడవిలో నూకలు ఉండవు. వేటగాడు తీసుకొచ్చాడు కాబట్టే అవి అక్కడ ఉన్నాయి అని చిత్రగ్రీవుడు తెలుసుకున్నాడు. అందుకే ఆ నూకలకు ఆశ పడకూడదు అన్నాడు.

  1. పావురాలు వలను ఎట్లా ఎగరేసుకు పోగలిగాయి?

జ:- ఏదైనా కష్టం వస్తే ఒక్కరితో సాధ్యం కాని పని పది మంది కలిస్తే సాధ్యపడుతుంది. ఇక్కడ పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. అవి చిత్రగ్రీవుడిని కాపాడమని వేడుకున్నాయి. చిత్రగ్రీవుడు పావురాలు అన్నీ కలిస్తే ఏదైనా చేయొచ్చని ప్రోత్సహించాడు. అప్పుడు పావురాలు అన్నీ ఒక్కసారిగా ఎగరడంతో వల కూడా వాటితో పాటు ఆకాశంలోకి ఎగిరింది.

  1. చిత్రగ్రీవునికి హిరణ్యకుడనే మిత్రుడు లేకుంటే ఏం జరిగి ఉండేది?

జ:- చిత్రగ్రీవునికి సహాయం చేసే గుణం ఉన్న హిరణ్యకుడనే మిత్రుడు ఉన్నాడు. కాబట్టి వలతో సహా ఎగిరిపోవాలనే ఆలోచన వచ్చింది. అలాంటి మిత్రుడు లేకుంటే వేరే ఆలోచన వచ్చేది. ఎందుకంటే తన వారిని కాపాడాలనే తపన కలిగిన నాయకుడికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది. మరో ఆలోచన చేసి ఏదో విధంగా ఆ పావురాలను వల నుంచి తప్పించి ఉండేవాడు.

  1. ఐకమత్యమే మహా బలం అంటే ఏమర్థమైంది?

జ:- బలహీనమైన పావురాలు కలిసి వలను ఎగరేసుకుపోవడం, పలచని గడ్దిపోచలు అన్నీ కలిసి ఏనుగును సైతం బంధించగలగడం వంటి విషయాలు విన్న తరువాత మనం కూడా తలచుకుంటే ఏదైనా చేయగలం అని నాకు అర్థమైంది. నీనొక్కడినే ఏమీ చేయలేను అని అనిపించినప్పుడు ఇతరుల సహాయం తీసుకొని ఆ పని పూర్తి చేయాలి అని తెలుసుకున్నాను. కాబట్టి అందరితో స్నేహంగా ఉండాలి అందరూ ఏదో సమయంలో సహాయ పడుతారు.

  1. చిత్రగ్రీవుడు మంచి నాయకుడుగా, మిత్రుడుగా పావురాలను ఆపద నుండి ఎట్లా రక్షించగలిగాడో రాయండి.

జ:- చిత్రగ్రీవుడు పావురాల కోసం ప్రాణాలైనా ఇవ్వగల ధైర్యవంతుడు. ఎంతో తెలివైనవాడు. అందరితోనూ స్నేహంగా ఉంటాడు. ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవ్వరినీ చులకనగా చూడడు. అందరినీ గౌరవిస్తాడు.

 చిత్రగ్రీవుడు పావురాలను ముందే హెచ్చరించాడు. అయినా అవి వినలేదు. వినలేదని చిత్రగ్రీవుడు కోపగించుకోలేదు. ఆపద వస్తుందని ముందే తెలిసినా పావురాలతోనే కలిసి ఉన్నాడు. వలలో చిక్కుకున్నా పావురాల వలె భయపడిపోలేదు. ధైర్యంగా, ఓపికగా ఆలోచించి బయటపడే మార్గం వెతికాడు. ఒక్కరి వల్ల కానిది అందరూ కలిసి సులభంగా చేయొచ్చని నిరూపించాడు.

చిత్రగ్రీవుడు హిరణ్యకునికి పూర్వం సహాయం చేసి ఉంటాడు. అందుకే హిరణ్యకుడు అడిగిన వెంటనే కష్టమైనా వల మొత్తం కొరికి పావురాలను రక్షించాడు.


పదజాలం

సొంతవాక్యాలు

  1. ఆరగించు=తిను

సంక్రాంతి పండుగకు పిండివంటలు ఆరగిస్తారు.

  1. ప్రమాదం=ఆపద

నగరాలలోని రోడ్లపైన నిత్యం ప్రమాదాలు జరుగుతాయి.


అర్థాలు

  1. ఇంపు=ఆనందం

  2. ఐకమత్యం=కలిసిమెలిసి

  3. ఉచ్చు=వల/ఉరి

  4. విముక్తి=స్వేచ్చ/విడుదల

  5. ధన్యుడు=అదృష్టవంతుడు/పుణ్యాత్ముడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu