11, అక్టోబర్ 2022, మంగళవారం

పాప పలుకులు 8th class 3rd Language Telugu

 పాప పలుకులు


Short answers

  1. పాప పలుకులు పాఠం ఏ పుస్తకం నుండి తీసుకున్నారు?

జ: పాప పలుకులు పాఠం పసిడి రథం పుస్తకం నుండి తీసుకున్నాము.

  1. పాప పలుకులు పాఠం ఎవరు రాశారు?

జ: పాప పలుకులు పాఠం ఆవంత్స సోమసుందర్ గారు రాశారు.

  1. ఎవరి నోటి మాటలు గలగలలాడాయి?

జ: పాప నోటిలో మాటలు గలగలలాడాయి.

  1. ఆవంత్స సోమసుందర్ ఎక్కడ జన్మించాడు.

జ: ఆవంత్స సోమసుందర్ తూర్పు గోదావరి జిల్లా, శంఖవరం గ్రామంలో జన్మించాడు.

  1. పాప పలుకులు పాఠం ఏ ప్రక్రియకు చెందినది?

జ: పాప పలుకులు పాఠం గేయ ప్రక్రియకు చెందినది.

  1. మల్లె తీగకు ఏ పూలు పూస్తాయి?

జ: మల్లె తీగెకు మల్లె పూలు పూస్తాయి

  1. తలంపులు అంటే ఏమిటి?

జ: తలంపులు అంటే ఆలోచనలు.

  1. చేపలు ఎక్కడ ఉంటాయి?

జ: ఏరులోని నీటిలో చేపలు ఉంటాయి.

  1. చుక్కలు అంటే ఏమిటి?

జ: చుక్కలు అంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలు.

  1. పిట్టలు ఎక్కడ కిలకిలమంటున్నాయి.

జ: చెట్టు కొమ్మలో పిట్టలు కిలకిలమంటున్నాయి.


స్వీయ రచన


  1. మీకు ఏ పువ్వంటే ఇష్టం? ఎందుకు?

జ: నాకు గులాబి పువ్వంటే ఇష్టం. ఎందుకంటే అది ఎరుపు రంగులో చూడ ముచ్చటగా ఉంటుంది. తాకితే మృదువుగా ఉంటుంది. ఈ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. గులాబి రేకులను వంటలలో కూడా ఉపయోగిస్తారు.


  1. మంచి తలంపులు అంటే ఏమిటి?

జ: తలంపులు అంటే ఆలోచనలు లేదా కోరికలు అని అర్థం. మంచి తలంపులు అంటే మంచి ఆలోచనలు. చెడు పనులు చేయకపోవడం, చెడుగా ఆలోచించకపోవడం, ఎవరినీ బాధ పెట్టకపోవడం, అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండడం, అందరికీ సహాయం చేయడం అనేవి మంచి తలంపులు అని చెప్పవచ్చు.


  1. విద్యార్థులుగా మీరు అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు ఏవి? వీటిని ఎందుకు అలవర్చుకోవాలి.

జ: ఉదయమే నిద్రలేవాలి. శుభ్రంగా స్నానం చేసి, సమయానికి పాఠశాలకు వెళ్ళాలి. తోటి విద్యార్థులతో స్నేహంగా మెలగాలి. అందరినీ నవ్వుతూ పలకరించాలి. పెద్దవారిని గౌరవించాలి. తల్లిదండ్రులను, గురువులను పూజించాలి. వృద్దులకు ప్రేమగా కబుర్లు చెబుతూ, సమయాన్ని గడపాలి. కష్టపడి చదివి, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలి.

పై గుణాలు విద్యార్థులు తప్పనిసరిగా అలవర్చుకోవాలి.

వీటిని ఎందుకు అలవర్చుకోవాలంటే..

మంచి గుణాలు ఉంటే మంచి పేరు లభిస్తుంది. అందరూ మెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు లభిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది.


సృజనాత్మకత


పిట్టలు పిట్టలు పిట్టలు

చిట్టి పొట్టి పిట్టలు

రంగురంగుల పిట్టలు

కిచకిచలాడే పిట్టలు

చక్కని గూడును కట్టును

వెచ్చగ నిద్దుర పోవును

పిట్టలు పిట్టలు పిట్టలు

ఎంతో చక్కని పిట్టలు



పదజాలం


నక్షత్రాలు= చుక్కలు, తారలు

మంచి= మేలు, హితం

ఆకాశం= నింగి, గగనం


సొంత వాక్యాలు


  1. చెట్టు మీద పక్షులు కిలకిల శబ్దం చేస్తున్నాయి.

  2. కొందరి మాటల వల్ల మనసు కలకల మంటుంది.

  3. నా బట్టలు తళతళా మెరుస్తున్నాయి.

  4. రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలు మిల మిలా మెరుస్తాయి‌.

  5. నదిలో నీరు గలగలా పారుతున్నాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu