చదువుదాం
1 Mark Questions
1.చదువుదాం పాఠంలో మీరు ఏం నేర్చుకున్నారు?
జ. సమాజంలో ఎలా మెలగాలో నేర్చుకున్నాము.
2.సాధనాలు చేయడం అంటే ఏమిటి?
జ. చదివిన తరువాత ప్రయోగాలు చేసి, పరికరాలు తయారు చేయడం.
3.శత్రువును ఎలా ఎదిరించగలము?
జ. కలిసిమెలిసి ఉన్నప్పుడు శత్రువులను ఎదిరించగలం.
4.సమష్టి అంటే ఏమిటి?
జ. సమష్టి అంటే కలిసిమెలిసి.
5.కులాలు, మతాల పేరుతో ఏమి చేయకూడదు?
జ. కులాలు, మతాల పేరుతో కొట్లాటలు చేయకూడదు.
6.చంద్రమండలానికి ఎందుకు వెళ్ళాలి?
జ. చంద్రుణ్ణి చూడడానికి చంద్రమండలానికి వెళ్ళాలి.
7.హింసకు వ్యతిరేక పదం రాయండి.
జ. హింసకు వ్యతిరేక పదం అహింస.
8.గాంధీజీ ఏం చెప్పాడు?
జ. అహింస పాటించమని చెప్పాడు.
9.'శోకాలను తుడిచేతాం' అంటే ఏమిటి?
జ. 'బాధలు లేకుండా చేద్దాం' అని అర్థం
10.ఎలాంటి కాలాలు వెతుకుదాం అని కవి చెప్పాడు?
జ. కరువు కాటకాలు లేని కాలాలు వెతుకుదాం అని కవి చెప్పాడు.
2 Mark Questions
1.కరువు కాటకాలు లేకపోవడం అంటే ఏమిటి?
జ. వర్షాలు ఎక్కువగా పడి, పంటలు బాగా పండాలి. తిండి దొరకని వారు ఎవరూ కనిపించకూడదు. అందరూ సుఖ, సంతోషాలతో జీవించాలి.
2.అహింసా మార్గంలో ఎందుకు నడవాలి?
జ. హింస వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ఆస్తులు ధ్వంసం అవుతాయి. దేశంలో పేదరికం పెరుగుతుంది. కరువు కాటకాలు ఏర్పడుతాయి. ప్రజలకు సంతోషం కరువవుతుంది.
3.భారతదేశ గొప్పదనం గురించి రాయండి.
జ. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు, రాష్ట్రాలు ఉన్నాయి. అయినా ప్రజలంతా ఎలాంటి భేదాలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తారు. గ్రామాలలో ఎక్కువ మంది ప్రజలు జీవిస్తున్నారు. వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధార పడ్డారు.
4.దాశరథి కృష్ణమాచార్యుల గురించి రాయండి.
జ. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. అగ్నిధార, రుద్రవీణ వీరి రచనలు. ఎన్నో గేయాలు, సినిమా పాటలు రాసాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి.
5.చదువుకోవడం వల్ల కలిగే లాభాలు ఏవి?
జ. బాగా చదువుకుంటే మంచి పేరు వస్తుంది. అందరూ మెచ్చుకుంటారు. తెలివితేటలు పెరుగుతాయి. మంచి ఉద్యోగం వస్తుంది. అమ్మా, నాన్నలను బాగా చూసుకోవచ్చు. సంతోషంగా జీవించవచ్చు.
(Write all questions in the class work)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి