3, మే 2018, గురువారం

రచయిత శైలి పుస్తకాల సమీక్ష

"కథల్లోకి వెళ్ళేముందు ఒక్క నిముషం....
కథలంటే చెవి కోసుకోంది ఎవరు? కొందరు కథలు రాయడం సులభం అనుకుంటారు! ఉదయమో కథ,మధ్యానమో కథ,రాత్రికో కథ బరికేసి ఇదీ కథే అనే మహానుభావులూ ఉన్నారు. తేలికగా రాసేది కథ కాదు. ఎన్నో రాత్రుల మథనం తర్వాత కథ పుడుతుంది." ఇలాంటి ముందు మాటలతో మొదలైన కథల పుస్తకాలు రెండు చదివాను ఈరోజు.. అబ్బో ఇంతలా చెప్తున్నాడు కథలు ఇంకెంత మనోహరంగా చెప్తాడో అనుకున్నాను. చదవడం మొదలు పెట్టాను. ఏ ఒక్క కథకు సరైన ప్రారంభం లేదు ఆలోచింప చేసే ముగింపు లేదు. కనీసం ఎదో ఓ నీతి అయినా ఉంటుందేమో అని ఆశగా వెతికాను కాని నా ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.
 రచయిత తనే కథలను రాసినట్టు చెప్పుకున్నాడు కానీ అవి పూర్వం ఉన్నవే తన స్వదస్తూరితో రాసుంటాడు అంతే కనీసం ఉన్న కథలను కూడా ఆసక్తి కరంగా రాయలేకపోయాడు. కనీసం ఆ కథలను ఉన్నవి ఉన్నవి ఉన్నట్టుగా టైపు చేయించినా పోయేది వాటిని తన స్వంతాని మార్చుకొని ఇష్టానుసారంగా రాయడం నాకు బాధ కలిగించింది.

 రాజుచెప్పిన కథలు అని శీర్షిక పెట్టారు కానీ అవి ఏవీ రాజు చెప్పినవి కావు బహుశా రాజుకు చెప్పినవి అయి ఉండవచ్చు. ఇంకో పుస్తకం బాలలు చెప్పిన కథలు లోపలి పేజీలో బాలలు చెప్పిన భక్తి కథలు అని శీర్షిక ఉంచారు దాని అర్థం రచయితకు మాత్రమే తెలియాలి. అవి కూడా బాలలు చెప్పినవనే ఉద్దేశం ఏ కథలోనూ కనిపించలేదు.
 ప్రతీ కథకు చివరలో వాళ్ల ఉద్ధేశాన్ని రచయితే చెప్పేయడం అస్సలు బాగాలేదు.. కొన్ని విషయాలను పాఠకులకే వదిలేయడం మంచిది తద్వారా బహుముకమైన ముగింపులు ఆ కథకు వచ్చే అవకాశం ఉంది కొన్ని సార్లు రచయిత సైతం ఊహించని విధంగా మరో కోణంలో ఆ కథ అర్థం చేసుకోబడవచ్చు. కాబట్టి రచయిత ముందుగా కథలను చెప్పి వారి ముఖ కవలికలను మరియు వారి అభిప్రాయాలను తీసుకొని రాస్తే బాగుండేది.

>రామమూర్తి దండె MA,MA,B.Ed,(M.Phil),UGC-NET

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్