పెళ్ళంటె నూరేళ్ళ పంట
కలకాలమూ బ్రతుకుమంట
ఏడడుగులా బంధమంట
ముచ్చటగ మా బావ
మూడు ముళ్ళు వేస్తె
మూడు లచ్చలప్పు
నా పాలుకే ఒచ్చె
ఎదనిండుగా బావ
ఏడడుగులు వేస్తె
ఏడు లక్షల కరుసు
సూపిండు మా నాన్న
పెద్ద దిక్కని చెప్పి
పెళ్ళి బరువెత్తుకొని
పుస్తెలు పడగానె
పెడముకం పెట్టిండు
పేరుకే పెద్దనాన్న
IIపెళ్ళంటెII
పెళ్ళి లో పనులన్ని
పొల్లుబోక చేసి
పిల్ల పిల్లగాన్ని
అలా సాగనంపి
అలసి సొలసి అంతా
మురిసి మురిసి పోయె
IIపెళ్ళంటెII
>డి.ఆర్.మూర్తి(17.01.2015) .98)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి