హృదయం ద్రవించి ఊసులై ప్రవహించితే
కవనాల కాంత కావ్యమై అలరించితే
ఎదలోని కలత జగమంత ఎగబాకితే
కవినౌదునా..? ప్రతి మదిలోన కొలువౌదునా..?
ఆత్మీయ బంధాలు అందరిలొ చిగురిస్తె
బతుకు తీపి ఓ క్షణమైన చూపిస్తె
బంగరు భవిత కు బాటలు వేస్తె
ఏకాకి మనిషికి ఏకాంతమిస్తె
కవినౌదునా..? ప్రతి మదిలోన కొలువౌదునా..?
ఒంటరి వాడికి నేస్తాన్నిస్తే
జంటగ మారితె శాంతాన్నిస్తె
రంది విడిచి చిందులేస్తె
సందు దొరికితె సందేశాలిస్తె
కవినౌదునా..? ప్రతి మదిలోన కొలువౌదునా..?
>డి.ఆర్.మూర్తి(13.04.2015) .99)


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి