6, నవంబర్ 2015, శుక్రవారం





సర్కారు ఆఫీసుల్లొ
సామాన్యుల వెతలు సూడు
సర్కారు కొలువులకై
సదివి పడే పాట్లు సూడు

పుట్టుక యాడన్నది
పటువారికి తెల్సునంట
గిరిదవారు, తయిసిల్దారు
సయ్యంటే సాలునంట
సర్టిఫికేటు సిద్దమంట
 
పటువారి కొలువులంటె
పది లక్షల నిరుద్యోగులు
పడని పాట్లు పడి సదివి
పరేశాను అయిపాయె
కొలువన్నదె రాకపాయె

నువు రాసుకున్నదే కులము
చేతికందితే పణము
నీకు లక్షలొచ్చినా సరే
ఒక సున్నా పీకి ఇస్తరట
సర్టిఫికెట్టు సేతికి

సర్కారు కొలువు కొరకు
సూసి కన్లు కాయ గాసె
కోచింగు సెంటర్లల్ల
పోసిర్రు పైసలన్ని
సదివింది సగము మరిసె
సర్కారు కొలువులిడిసె

పాసుబుక్కు లియ్యమంటె
పటువారి పైసలడిగె
పంట ఎండి నష్టమైతె
పరిహారం ఇయ్యనీకి
చెరి సగము పాట పాడె

బతకనీకి కూలి కెల్తె
సదవనీకి యాల లేక
కాయిదాల సదువంతా
పొట్టనింప లేక పాయె
కూలి బతుకే మిగిలె
బొందిలొ ప్రాణం వదిలె


                   >డి.ఆర్.మూర్తి(17.01.2015)            .97)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu