7, నవంబర్ 2015, శనివారం





ఏమోయ్ చాందమూర్తి
ఏమైందోయ్ చాందమూర్తి
లేవోయ్ చాందమూర్తి
నేనోయ్ రామమూర్తి

నిన్న గాక మొన్నగదోయ్
నీ చేతిలొ చెయ్యేసి నడిచి
ఓరుగల్లు చుట్టేస్తిమి
జోరు మాటలాడేస్తిమి
దూపగొంటె నీళ్ళిస్తిని
ధూమశకటమెక్కేస్తిమి
మామా కోడళ్ళ
మమకారాన్ని కనులగంటి
అంతలోనె ఏమైందోయ్
అందకుండ పోయితివి
IIఏమోయ్II
నువ్వల్లిన పాటలింటె
మువ్వలె చిందేసునంట
రామున్వేషమేస్తివంటె
రాముడె దిగెనందురంట
కుంచె పట్టి బొమ్మలేస్తె
కంచు ప్రతిమలందురంట
ఎంత ప్రతిభ సొంతమైన
అంతులేని లోకమేగావేమోయ్
IIచాందమూర్తిII
జిజ్ఞాసతొ విజ్ఞానమొంది
ప్రజ్ఞతొ నవకల్పనొనర్చి
అభ్యాసిగ ఉన్ననాడె
అన్వేషణ చేసినవట
సంద్రమంత భారతాన్నె
ఇంద్రుడల్లె ఏలితివట
ఎంత ప్రతిభ సొంతమైన
అంతులేని లోకమేగావేమోయ్
IIచాందమూర్తిII
సుధ పానమే చేయు దేవా
సుర పానమేలనంపావయా
నిను మించి తెలివుందనేనా
కన లేక ముంచావు మధువునా
ఆ కర్ణుడినే లొంగదీసి
ఏకలవ్య వేలుకోసి
నీ వాళ్ళ గెలుపు కొరకు
నీవాడె ఆట ఇది
నీ ఆట లొ జీవులంత
నీ చేతిలో పావులు

>డి.ఆర్.మూర్తి(04.10.2014)    .100)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu