సుగ్రీవాజ్ఞ ను తలిచెను
మహేంద్రగిరిపై నిలిచెను
జలధిపైకెగిరెను హనుమా!
గాలిలొ సాగెను హనుమా!
సముద్రుడాజ్ఞను గైకొని
మైనాకుడేగెను వెలికి
ఆగను అనెను హనుమా!
సాగుతు పోయెను హనుమా!
సురస పరీక్షలొ గెల్చెను
సింహిక మేనును చీల్చెను
నూరు యోజనాలెగిరి
చేరెను త్రికూటగిరిని
లంకకు కాపల లంకిణి
రంకెలు వేస్తూ దుంకెను
ఒక్క దెబ్బకే నేల కూలెను
రక్కసి లంకకు దారినిచ్చెను
అశోక వనమున సీతను చూసి
రాముని కథను గానము చేసి
రామ ముద్రికను సీతకిచ్చెను
చూడామణిని గైకొని సాగెను
శింశుపా వృక్షము విడిచి
అశోక వనమును విరిచి
రావణ శక్తిని చూసెను
రాముని గొప్పను చెప్పెను
కోపముతో ఆ రావణ
తోకకు నిప్పు పెట్టెను
కోపముతో ఈ హనుమా!
లంకకు చిచ్చు పెట్టెను
అరిష్టగిరిపైకెక్కి ఎగిరి
మహేంద్రగిరిపై కాలుమోపి
దృష్టాసీతేతి అనెను
రామ కార్యమే సఫలమాయెను!
>డి.ఆర్.మూర్తి(12.11.2015) .101)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి