4, నవంబర్ 2015, బుధవారం




వేకువ జామున కురిసే మంచులొ మురిసే మోముతొ
ఆకుల మాటున చాటుగ చూసిన అందపు జాడలు
ముసిరెను మనసులొ మెదిలే గురుతులు మదినే గిల్లెను
పల్లెల అందము రాసిగ పోసి రూపము పొంది  ఎదురుగ నిలిచెను

జిలుగుల మెరుపుల నీలి కన్నులు
ఒలికెడి కులుకుల మేను సోకులు
ఎగిరెడి చిలుకల కొంటె పలుకులు
ఎగిసెడి ఏరుల కురుల సొగసులు
పలికెడి పైరుల కాలి అందెలు
విరిసిన పద్మము చెలి పాదములు

నింగికి పొంగిన తుంపర చందము నొసటన తేలే ముంగురులూ
అందపు గందము పూసిన చందము నున్నని పాల చెక్కిల్లూ

రోజపూవు పెదవులూ! రాజుకునే సొగసులూ!!
హంసవంటి నడకలూ! హింస పెట్టే చూపులూ!!


                                      >డి.ఆర్.మూర్తి(26.01.2015)               .89)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu