15, ఆగస్టు 2015, శనివారం

పోరు సలిపెను ధీర పుత్రులు
చెరను వీడెను భారతావని
ప్రాచ్య విలువల స్వేచ్ఛ భారతి
సాధ్యమాయెను శాంతమూర్తిచె


సవాలు చేసి సిపాయిలంత
తరుమ జూసిరి తిరుగుబాటుతో
మిత కాంక్షలతొ మితవాదులు
నిరసన తెలిపెను పరదేశులపై

దొరల దోపిడి డ్రెయిన్ థియరితొ
దాదాబాయ్ నౌరోజి తెలిపెను
రక్తపాతపు రష్య విప్లవం
అతివాదులకాదర్శమయ్యెను

బాంబులు విసిరిన భగతు సింగు
ఉద్యమాగ్నికి ఊపిరిచ్చెను
అల్లూరి విల్లుకల్లాడి పోయి
బుల్లెట్లు దింపె తెల్ల దొరలు
నింగికేగిన జంగు రగిలెను

లాల్ బాల్ పాల్ జూల్ విదిల్చెన్
వందేమాతర ఉద్యమానికై
విదేశి బట్టలు పడేసి కాల్చిరి
విద్యార్థి వీరులు ఉద్యమించిరి

ఖిలాఫత్ లో ముస్లిం వీరులు
విరోచితముగ పోరు సలిపిరి

సుభాషు చంద్ర బోసు మనకై
ఆజాదు హిందు ఫౌజు నడిపె
బ్రిటిషు గుండెన రైళ్ళు ఉరికె
భరత యువకుల నెత్తురు మరిగె

"జలియన్ వాలా బాగ్" దుర్ఘటన
"చౌరీ చౌరా" ప్రజల ప్రతిఘటన

హింసను ఆపి శాంతము చూపి
దండు నడిపెను దండి యాత్రకై
తెల్ల దొరలార! "క్విట్ ఇండియా"
భారతీయులు.. "డూ ఆర్ డై"
నినదించెను స్వతంత్రమిచ్చెను
భరత జాతి పిత గాంధీ మహాత్మ

--రామ్మూర్తి దండె(15.08.2015)         88).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu