4, నవంబర్ 2015, బుధవారం




ఊహ సుందరీ.. మోహించి చంపకే
ఎన్నొ రాత్రులూ.. కలలెన్నొ కంటినే
ఎదుట లేకున్నా.. ఎదనిండ నువ్వేలే
రామయ్య మనసులో.. సీతమ్మ మల్లేలే

కౌమారమె కౌగిలించ
కలలకి కదిలొస్తివె చెలి

వదలలేక కదలనీక
మదిని బాదిస్తివె చెలి
మందిస్తివొ, మంత్రిస్తివొ
మాయలేడివై మాటేస్తివొ..

కలువలు చూసి నీ కనులనుకుంటి
చిలుకల సవ్వడి పలుకనుకుంటి
కోయిల కూతలు పాటనుకుంటి
తూరుపు సూరిడు బొట్టనుకుంటి
పడమర చంద్రుడు మోమనుకుంటి
తామర రేకులు పెదవనుకుంటి
పారే ఏరులు కురులనుకుంటి
నెమలి ఆట నీ నటననుకుంటి
దూరపు కొండలు మేననుకుంటి

నెలవంక చూసి నడువొంపు తలచి
నడిరేయి లోన నిను అలుముకుంటి..
ఊహ సుందరీ.. మోహించి వెళ్ళకే
ఎన్నొ రాత్రులూ.. కలలోనె ఉంటివే..

                                      >డి.ఆర్.మూర్తి(01.11.2014)                   .90)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu