6, నవంబర్ 2015, శుక్రవారం







బొడ్రాయి పండుగల
ఊరంత సందడిగ
బోనాలు ఎత్తిర్రు
బాణీలు కట్టిర్రు
అందెలను చుట్టిర్రు
చిందేసి ఆడిర్రు

ఆ కులమొ ఈ కులమొ
ఏ కులమొ మర్శిర్రు
ఉర్కు పర్గులు వెట్టి
జనమంత కదిలిర్రు
బొడ్రాయి పండుగల
ఊరంత సందడిగ

ఊర్ల జెండా కాడ
ఊరాంతా కూడిర్రు
బొడ్రాయి కథ ఇంటూ
రాత్రంతా గడిపిర్రు
బొడ్రాయి పండుగల
ఊరంత సందడిగ

తండ్రి వోలె గావమని
బొడ్రాయిని నిలిపిర్రు
సల్లగ మము సూడమని
పూజలెన్నొ సేసిర్రు
బొడ్రాయి పండుగల
ఊరంత సందడిగ


                   >డి.ఆర్.మూర్తి(14.05.2015)            .95)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu