6, నవంబర్ 2015, శుక్రవారం







బయిరంగ సభ వెట్టె
బస్సులన్నిటువెట్టె
బలగమును రాబెట్టె
భలమెంతొ సూపెట్టె

ఊళ్ళకూళ్ళు కదిలొచ్చె
వాళ్ళువీళ్ళు కలిసొచ్చె
వయసు మరిసి ఉరికొచ్చె
మనసు మురిసి నడిసొచ్చె

జన జాతర సాగెను
సభ సంద్రమాయెను
జయజయలు మోగెను
హోరు జోరు పెరిగెను

బాస సేసె కేసిఆరు
ఆసయాల సాధనకై
బంగరు తెలగాణకై
రంగుల బతుకులకై

పదును తగ్గలేదంటు
పదవి పదిలమేనంటు
ప్రజల మరవలేనంటు
ప్రాణమివ్వగలనంటు

బాస సేసె కేసిఆరు
బంగరు తెలగాణకై


                   >డి.ఆర్.మూర్తి(14.05.2015)            .94)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్