2, మార్చి 2015, సోమవారం

future school, m.k nagar లో 10th class వాళ్ళ పై రాసిన పాట..

వీడిపోతున్నాము.. వీడలేకున్నాము..
ఎంత కాలమో.. ఈ స్కూలులో.. కలిసి మెలిసి ఉన్న మనము వీడిపోతున్నాము
వీడిపోతున్నాము.. వీడలేకున్నాము..
ఈ స్కూలులో.. ఇన్నాళ్ళుగా.. మా అమ్మ చూపులాగే ప్రేమ అందుకున్నాము
వీడిపోతున్నాము.. వీడలేకున్నాము..

శ్రీలేఖ చాచినా స్నేహ హస్తము.. జైత్ర చాటిన వనిత సుగుణము..
రాణి, శిరిణిలను వేయించిన డాన్సు.. మెసేజ్ కు మసాజ్ చేసిన సిస్సు..
ప్రభను కొలనులో తోసిన వేళ.. ఈత రాక మునకేసిన గోల..
సాయిరామువి స్టమకు డాన్సులు.. నవీను వేసెడి కుళ్ళు జోకులు..
కార్తీకు చూపెడి సమయ పాలన.. మౌనముండును మౌనిక మదిన..
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..
కోడి గెంతుల రేవంత్ నడకలు.. శ్రీనివాసువి సిగ్గుల మెళికలు..
శ్రీనాధ్ అల్లిన చిన్ని కవితలు.. సాయి కిరణ్ రాతలో పాము నడకలు..
సున్నిత మదితో మెదిలే భారు.. కాటుక కళ్ళతొ కదిలే పారు..
ఆదిత్య ఇన్నోసెన్సు చూపులు.. ఇంటిలిజెన్సుతొ పలికే పలుకులు..
క్రికెట్ పిచ్చితో అరిసే మనీష్.. మాటలొ ధైర్యం చూపెడి రాజేష్..
వీడిపోతున్నాము.. వీడలేకున్నాము..

>రామ్మూర్తి దండె (26.02.2015) 87)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu