20, జనవరి 2015, మంగళవారం

రాకుమారుడు


చిరు గాలి తాకి తనువు తావి పీల్చెను
నడు వొంపు సొంపు పంచెను చెంగు తీసెను
ఎద పొంగు తొంగి చూసెను మది దోచెను
తళ్కు చుక్కలన్ని మెరిసి మోము చూసెను
సోకు వలచి పిల్ల కాలువ పరుగు తీసి గంతులేసెను
సోగ కనులు గాంచి కలువ కనులు తెరిచి కలలుగనెను
//చిరు గాలి//
మోము చంద్ర బింబమూ! దేవ కన్య దేహమూ!!
మరులు గొలిపె సోకులూ! మంత్రమేసె చూపులూ!!
నా ఊసులొ నిలిచే కులుకుల పలుకులకై వింటున్నా..
నా ఊహలొ మెదిలే వలపుల మధనుడికై చూస్తున్నా..
//చిరు గాలి//
గ్రీకు దేశ వీరుడో! కలల రాకుమారుడో!!
మల్ల యుద్ద ధీరుడో! మగువ మనసు చోరుడో!!
మనసు గెలిచి నను వలచే ప్రియుడుని తలపోస్తున్నా..
పిలుపు తలచి పరుగునొచ్చె ప్రియవరుడికై వేచున్నా..

                                        >డి.ఆర్.మూర్తి(19.01.2015)                  83).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu