సెలయేరు
సెలయేరు మలుపులన్ని నడువొంపు కులుకులై
తరిసిరుల పలుకులన్ని కాలిఅందెల మోతలై
రంగవల్లి తళుకులన్ని సోయగాల సొంపులై
పల్లెతావి సుమములన్ని ఎదలోని మెరుపులై
తరిసిరుల పలుకులన్ని కాలిఅందెల మోతలై
రంగవల్లి తళుకులన్ని సోయగాల సొంపులై
పల్లెతావి సుమములన్ని ఎదలోని మెరుపులై
పున్నమి చంద్రుడు పుడమిన మోముగ మారినడంట
వెన్నెల వెలుగును తనువున నింపి తరించినడంట
వెన్నెల వెలుగును తనువున నింపి తరించినడంట
కనులు నల్ల కలువలూ! గులాబి రేకు పెదవులూ!!
శంకము వంటి కంఠమూ! స్వరము కోకిల గానమూ!!
ఈ గడుసరి మగువకు సరిపడె సొగసరికై చూస్తున్నా..
ఈ వళులను పొందెడి మగసిరి మగనికొరకై వేచున్నా..
శంకము వంటి కంఠమూ! స్వరము కోకిల గానమూ!!
ఈ గడుసరి మగువకు సరిపడె సొగసరికై చూస్తున్నా..
ఈ వళులను పొందెడి మగసిరి మగనికొరకై వేచున్నా..
అల్లసాని ప్రవరుడూ! గోకులంలొ కృష్ణుడూ!!
ఏకపత్ని రాముడూ! తాండవాల ఈశుడూ!!
కలగలిసిన వరుడెవడో నని కలలెన్నొ కంటున్నా..
కలకాలం కలిసుండే ప్రియ వరుణికై నే వేచున్నా..
ఏకపత్ని రాముడూ! తాండవాల ఈశుడూ!!
కలగలిసిన వరుడెవడో నని కలలెన్నొ కంటున్నా..
కలకాలం కలిసుండే ప్రియ వరుణికై నే వేచున్నా..
>డి.ఆర్. మూర్తి(19.01.2015) 82).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి