20, జనవరి 2015, మంగళవారం

       గణతంత్ర దినోత్సవము

గణతంత్ర రాజ్యముకై గణమైన కృషి సలిపి
భారత భాగ్యము నిలిపి దేశ భవితను మార్చె
రాజ్యాంగ రచన కొరకు రాజ్యాంగ పరిషత్తునెట్టి
మహామహులేడుగురితొ రచన కమిటి నేర్పరిచి
అగ్రరాజ్య రాజ్యాంగాలన్ని పొల్లుబోక వల్లెవేసి రంగరించి
అంబేద్కర్ ఆశయాలు, నెహ్రూజీ నిర్ణయాలు,
వల్లభభాయ్ భావాలు, సర్వేపల్లి సలహాలు
కలగలిపి నెలకొలిపిన లిఖితమైన రాజ్యాంగము
మనకుమనమె ఇచ్చుకున్న అతిపెద్ద రాజ్యాంగము
నేడే.. నేడే.. నేడే.. నేడే..అమలులోకి వచ్చిందంట
//గణతంత్ర//
అమెరికాలొ అరువు తెచ్చి అమర్చెను ఆరు హక్కులు
రష్యా రాజ్యము లోని ఏకాదశ విధులు విధిగ చొప్పించె
త్రివిధనిర్దేశాలను ఐర్లాండ్ నుండి పొంది సూత్రీకరించెను
ఫ్రాన్స్ లోని ప్రజాస్వామ్య లక్షణాలు, గణతంత్ర విధానము
జపాన్ దేశ న్యాయ సూత్రాలను, కలగలిపి నెలకొలిపిన
అతిపెద్ద లిఖితమైన రాజ్యాంగము నేడే.. నేడే..
అమలులోకి వచ్చిందంట.. గణతంత్రము తెచ్చిందంట..
//గణతంత్ర//

>డి.ఆర్.మూర్తి(20.01.2015)                       (84.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్