దినకరా! ప్రభాకరా!
తూర్పు తెరలా దినకరా!
వెన్నంపల్లి ప్రభాకరా!
పసిప్రాయమునూరినొదిలి
కన్న వాళ్ళ ప్రేమనిడిచి
చదవబోతివా ప్రభాకరా!
చదువు తల్లి నీడ లోనా
వసతి లేని గృహము లోనా!
కరుకు నేల కౌగిటి లోనా
దుర్వాసుల నీడలలోనా
క్రొవ్వొత్తుల వెలుగులలోనా
చదవబోతివా ప్రభాకరా!
చదువు తల్లి నీడ లోనా
కలము హలము బూనిన పోతన
దారులెంట నువ్వే నడిచి
మార్గదర్శివయినావయ్యా
భావిపౌరుల పాలిట నువ్వు
ప్రకృతితో గానము నేర్చిన
గోపాలుడు నువ్వేనయ్యా
ప్రేమించే మనసును పొంది
ప్రేమతోనె పెద్దల గెలిచి
మార్గదర్శివయినావయ్యా
ప్రేమికుల పాలిట నువ్వు
మృదువైన హృదయముకు చిరునగువు కవచమై
మందహాస మధురిమతొ కార్యసాధకుడవై
వెన్నంటి మనసున్న మారాజువై
కన్నె మనసుల్ని దోచేసె రారాజువై
ఈర్ష్య పుట్టించె రూపుకు నిలయానివై
హర్షించె గాత్రముకు ఆసామివై
శిష్యుల మనసుల్లొ ఙ్ఞాన పూదోటవై
హాస్య చతురోక్తులందిస్తు, భవితకు
భరోసా నందిస్తు, మార్గదర్శి వైయినావయ్యా
గురువులందరి పాలిట నువ్వు
తూర్పు తెరలా దినకరా!
వెన్నంపల్లి ప్రభాకరా!
ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు....... రాంమూర్తి దండె(07.01.2015) 80).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి