12, జనవరి 2015, సోమవారం



రేసు కారు లాగ దూసుకుంటు పోయె రాషు కుర్ర వాన్ని
కత్తి చేత బట్టి కదనము నడిపెడి దమ్ములున్న వాన్ని
మీసము తిప్పి రోశము చూపెడి మాసు మన్మధున్ని
కన్నె పిల్లల మనసు రాజేసి కాజేసె వెన్న గోపాలున్ని
మోసగాల్ల బెండు తీసి, నీచకీచకుల లేకుండ జేసి,
దేశ ద్రోహుల అంతు జూసి, భరతావని మేలు కోరు
హాండుసమ్ము పోరగాన్ని.. పట్నవాసపు ప్యారు గాన్ని
అందగాల్లకందగాన్ని.. అప్సరసలకె అందనోన్ని..
//రేసుకారు//
నిరుపేదల నిర్భాగ్యుల కడుపు మంట చల్లార్చి
అలసి సొలసి సొమ్మసిల్లె కార్మికుల ఊరడించి
చదువు వదిలిన బాలల చదివించ తలపెట్టి
అంగవికలుల ఆర్తనాదములు వినబడని
మధ్యతరగతి బ్రతుకు తిప్పలు కనబడని
మనసు చేసెడి మాయమర్మములు
తొలిగి పోయి దేశ భవిత మారి పోయె రోజు కొరకు
ఎదిరి చూస్తు మదిని తడుతు పరుగు పెడుతు
//రేసుకారు//
నా మదిన మెదిలె మగువ కనులు కలువలకె ఎద గిల్లును
మెరిసె ముగ్ద మోము నిండు పున్నమి చంద్రుడి తల బోయును
కొటారి ముక్కు చిటారు కొమ్మ చిలకమ్మకె అసూయ పెంచును
మేను హొయలు మయూరి నాట్య భంగిమకె నవ హంగులగును
ప్రకృతి అందాలన్ని నా సుందరి తనువున దాగెను
పల్లె పరువాల పిల్ల నా మదిలొ మెదిలే మగువ
ఏడ దాగుందొ నా మదిలొ మెదిలే మగువ
ఎన్నడు దరి చేరునో నా మదిలొ మెదిలే మగువ
నా మదిలొ మెదిలే మగువా! నా దరి చేరేదెన్నడో....
//రేసుకారు//

           >రాంమూర్తి దండె(11.01.2015)               81).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu