దేవ కన్య
సెలయేరు మలుపులన్ని నడువొంపు కులుకులై
వరి మాగాణి గలగలలు కాలికి సిరి మువ్వలై
పచ్చని వాకిట ముగ్గులన్ని పరికిణీకి హంగులై
పల్లెటూరి పరిమళాలు నా మేనుకి పరువాలై
పున్నమి చంద్రుని నేల దించి మోము మలిచె నా బ్రహ్మె
దేవ కన్యలసూయ పడే రూపమిచ్చి పుడమి చేర్చె
//సెలయేరు//
కళ్ళు నల్ల కలువలూ! గులాబి రేకు పెదవులూ!!
శంకు రూపు కంఠమూ! స్వరము కోకిల గానమూ!!
నాకు జోడి ఎవ్వడో అది తెలియక చస్తున్నా..
ఏ లోకమునున్నడో ఎపుడొస్తడొ చూస్తున్నా...
//సెలయేరు//
అల్లసాని ప్రవరుడూ! గోకులంలొ కృష్ణుడూ!!
ఏకపత్ని రాముడూ! తాండవాల ఈశుడూ!!
కలగలిసిన వరుడెవడో నని కలలెన్నొ కంటున్నా..
ఈ అందాలు పొందెడి సుందరుడికై వేచున్నా..
>దండె రాంమ్మూర్తి(01.01.2015) (79.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి