ఊహా సుందరి
అలలతో సాగి వచ్చె
చల్లగాలి తాకినట్టు
అలలపై సాగిపోయె
నావలొ పయనించినట్టు
సంద్రమంచులే తాకిసంతసమే పొందినట్టు
ప్రకృతి అందం చూసి
కనుల విందు చేసినట్టు
జోరువానలో తడిసినఅడవిని చుట్టేసినట్టు
జలపాతపు హోరు వద్ద
తుంపరలో తడిసినట్టు
పురివిప్పిన నెమలి నటన
చాటుగ గమనించినట్టు
ఆరుద్రల అందాలను
చేతిలొ బందించినట్టుగరిక పచ్చ భూములలో
పరుగులు లంకించినట్టు
నిను కలిసిన వేళ నాకు
కలిగిన అనుభూతులెన్నొ..
>దండె రాంమ్మూర్తి(23.08.2014) (71.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి