24, ఆగస్టు 2014, ఆదివారం

తెలుగు తల్లీ..


తల్లీ మన్నించు! తెలుగు తల్లీ మన్నించు!!
గేళి చేసినారమ్మ! గాలి వెదవ లంత గూడి
జానపద కళలు ఆడి, తేట తెలుగు పాట పాడి
తెలుగు భాష సత్త చాటి, తల్లి భాష రుచి చూపి
తెలుగు మీది అభిమానం అదరక పదగురికి చూపి
ఉప్పొంగుతు, ఉరకలేస్తు నడయాడితి ఇంటి వైపు
గేళి చేసినారమ్మ! గాలి వెదవ లంత గూడి
తల్లీ మన్నించు! తెలుగు తల్లీ మన్నించు!!

తల్లీ నిను మరచి గొప్ప చెప్పె నేడు ప్రతి వాడు
ఓ తల్లి చెప్పె
"నా కొడుకు బంగారం, తెలుగు రాదు వాడికసలు"
"బంగారం అనగనేమి? యు మీన్ గోల్డ్"
అని కొడుకడిగె
పరభాషను మెచ్చుకుంటు, మన భాషను త్రుంచుకుంటు
లేని ప్రేమ తెచ్చుకుంటు, మమకారము చంపుకుంటు
మోసగిస్తున్నారు, మోసపోతున్నారు, మోడుబారుతున్నారు
తల్లీ నిను మరచి గొప్ప చెప్పె నేడు ప్రతి వాడు
తల్లీ మన్నించు! తెలుగు తల్లీ మన్నించు!!


>దండె రాంమ్మూర్తి(24.08.2014) (72.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu