22, ఆగస్టు 2014, శుక్రవారం

భరత మాత


దేశమేరూపమౌతున్నదో.... నా దేశమేలోకమెళ్తున్నదో...(2)
దేశ విదేశాలెన్ని తిరిగినా......(2)
నా దేశము మించి నే దేశమున్నదో...
నా దేశ గొప్పతనమింకే దేశము కున్నదో...
                                                     //దేశ మేరూప//

ఎద మాటున దాచి కాచు హిమలయాన్నడుగు
దేశమందాన్ని హెచ్చించే కాశ్మీరాన్నడుగు
గొంతు తడిపి పొట్ట నింపె గంగా నది నడుగు
భారతీయ ప్రేమ చాటు తాజ్మహల్ నడుగు
మతాలెన్ని ఉన్నా .... జాతులెన్ని ఉన్నా...  (2)
బిడ్డలంత ఒక్కటనే భరత మాత నడుగు...
అడుగు..... అడుగు.....
అడుగు.. అడుగు.. అడుగు..
మడుగు లొత్తి అడుగు
భరత మాత నడుగు......
భాగ్య సీమ నడుగు....               //నా దేశ గొప్పతన మెంతని//
                                                  //దేశ మేరూప//

"దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్"
అని జాడ చూపిన గురజాడ నడుగు
"భరత ఖండంబు చక్కని పాడి యావ"ని
నినదించిన చిలక మర్తి నడుగు
శాంతి జపముతొ దేశ సంకెళ్ళ్లు తృంచిన
బోసి నవ్వుల మహాత్ముడి నడుగు
దేశ పీఠమునెక్కి వెలిగిన, పసి హృదయాలెన్నొ గెలిచిన
జవహార్లాల్ నెహృ నడుగు
భాషలెన్ని ఉన్నా.... ప్రాంతాలెన్ని ఉన్నా....   (2)
బిడ్డలంత ఒక్కటనే భరత మాత నడుగు...
అడుగు..... అడుగు.....
అడుగు.. అడుగు.. అడుగు..
మడుగు లొత్తి అడుగు
భరత మాత నడుగు......
భాగ్య సీమ నడుగు....               //నా దేశ గొప్పతన మెంతని//



>దండె రాంమ్మూర్తి(24.01.2012) (68.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu