22, ఆగస్టు 2014, శుక్రవారం

మా తాత...


ఇంటి చుట్టు అందమెంచి
కనకాంభర పాదులెట్టి
పెరటి సొగసు కోసమని
రకరకాల చెట్లు పెంచి

పెరటి పచ్చదనమంతా
పసి మనసుతొ వీక్షిస్తు
స్వచ్చమైన సంతోషపు
లోయలలో పరవశిస్తు

హలము బూని సాగు చేస్తు
కలము బూని కథలు రాసి
నాటికలు, నాటకాలు ప్రదర్శిస్తు
ప్రతిభ చూపి, సత్తా చాటి
పల్లె వారి మనసుల్లో
పదిలమైన గూడు కట్టి

కన్న వారి క్షేమమే
నీ జీవిత ధ్యేయమంటు
ఆలన పాలన చూస్తూ
అడిగిన వన్ని ఇస్తూ
పెంచి పెద్ద చేసి
హృదయ రంజకంగా
పెళ్ళ్లి చేసి సాగనంపి
ఎడబాసిన పిల్లల తలచి
మనసు బాధతో రగిలి
కొడుకుల పిల్లల చూస్తూ
ఆనందం నింపుకుంటు
మనవళ్ళ్లను ఆడిస్తూ
అనుభవాలు బోధిస్తూ
మెళుకువలు నేర్పిస్తూ
సాహిత్య సంపదనిస్తూ
పెంచి పెద్ద చేసి
బిడ్డలు, బిడ్డల పిల్లలనెందరికో
బ్రతుకునిచ్చి, లాలించి, ఆడించి,
బోధించి పెంపు చేస్తె
వయసుడిగి బతకలేక
బతుకుతున్న వేళ
తోడు లేక, బాధిస్తూ,పీడిస్తూ, చావిస్తే
ఆ ముసలి జంట ఆత్మ ఘోష
ఏమని వర్ణించగలను......

>దండె రాంమ్మూర్తి(29.08.2011) (69.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu