22, ఆగస్టు 2014, శుక్రవారం

అప్పు..


నరకం చూడాలంటే చావే మార్గం కాదు
అప్పే ఇచ్చి చూడు చూపును నీకు వాడు
నరుడే పశువుగ మారు మార్గం తేలిక చూడు
అప్పే ఇచ్చి చూడు మార్చును నిన్ను వాడు

ఇది నరలోకం అని అంటే పరిశానే అవుతావు
పరలోకం అని అంటే నమ్మే తీరుతావు
జలగలు రక్తం తాగును అది తెలిసిన సత్యం నీకు
మనిషే నెత్తురు పీల్చును, మనశ్శాంతిని దూరం చేసును
కోపం, చిరాకు, చింతలు వచ్చును, వైరం చిగురించును
అప్పే ఇచ్చి చూడు జరిగే తీరును అన్ని

రామ రాజ్యం పోయె రావణ కాష్ఠం వచ్చే
నీతి నియమం ఏడ, న్యాయం ధర్మం ఏడ
సత్యం శాంతి పోయె, మోసం వంచనలొచ్చే
మంచి మనసులేడ, ప్రేమ కరుణలేడ
సేవ త్యాగం పోయె, మారణకాండలు వచ్చే
మనుషుల జాడలేడ, మృగములాయెనీవేళ


>దండె రాంమ్మూర్తి(29.06.2011) (67.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్