ఎద లోతులో నుంచి
తెరలు తెరలుగ వచ్చి
తరతరాలుగ నిల్చు నా భాష
స్వచ్చమైనా తెలుగు భాష
స్వచ్చమైనా తెలుగు భాష
చిరు పెదవిపై నుండి
చిలుక పలుకులై వచ్చి
కూటి కొరకే నేర్చు నీ భాష
పాదుకుంటి ఉన్న పర భాష
తల్లి కడుపులొ చేరి
నవమాసములెదిగి
వెలువడి స్తిరపడు నా భాష
తెల్లనైనా తల్లి భాష
కాన్వెంటు చెరలలో
చదువుల కార్ఖానాలలో
ఎదమూసి ఎక్కించు నీ భాష
బాధ పెట్టు ముళ్ళ్ల భాష
అమ్మ పాలతొ పాటె
పసి మనసులో నిల్చి
కాటి వరకు సాగు నా భాష
మచ్చ లేని మాతృ భాష
పోత పాలతొ పెరిగి
పొమ్మనక పొగబెట్టె
సవతి తల్లీ ప్రేమ నీ భాష
మందమైనా అంధ భాష
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి