పాట
యాదగిరి గుట్ట పిల్ల నువ్ అట్టా అంటే ఎట్టా
కొలనుపాక పిట్ట నువ్ నో అంటె నామీదొట్టా
నాకేమ్ తక్కువ పిల్ల చిరంజీవికె ఎక్కువ మల్లా
రాయుడి గారి బిడ్డ రామసక్కగ ఉన్నవె పిల్లా
//యాదగిరి//
బోనగిరి గుట్టల్లో ముద్దులు పెట్టేస్తా రామసక్కని పిల్లా
మా రాయుడోరి బిడ్దా
రాగీరి చెరువులో జలకాలాడిస్తా రామసక్కని పిల్లా
మా రాయుడోరి బిడ్దా
మాసపేట అడవుల్లో మత్తే ఎక్కిస్తా రామసక్కని పిల్లా
మా రాయుడోరి బిడ్దా
నమిలె నడిబొడ్డున నీ నడుమే గిల్లేస్తా రామసక్కని పిల్లా
మా రాయుడోరి బిడ్దా
ఆలేరు చెట్ల కింద రాతిరంత రచ్చ చేస్త రామసక్కని పిల్లా
మా రాయుడోరి బిడ్దా
//యాదగిరి//
సమ్మక్క సారక్క జాతర పోదాం! సరదా జాగారాలే చేద్దాం!
ఓరుగల్లు కోట కని, కాకతీయ చరిత విని,
రామప్పను దర్శించి వద్దాం! పిల్లా.. రామసక్కని పిల్లా
మా రాయుడోరి బిడ్దా
కొమరవెల్లి మల్లన్నను చూసొద్దాం! జాగిలాల గొప్పేంటో కందాం!
కొండగట్టు హనుమయ్య, ధర్మపురి నృసింహా,
ఏడుపాయల దుర్గమ్మ క్సేత్రాలు తిరిగి.. సందేలాకొద్దామే పిల్లా..
రామసక్కని పిల్లా
మా రాయుడోరి బిడ్దా
పట్నంలో అందాలను పరికిద్దాం! వింతలన్ని కళ్ళ్లారా చూద్దాం!
ట్యాంకుబండ్ బుద్దుని, గోల్కొండ ఖిల్లను,
చార్మినారు, ఫలక్నుమను చూసొద్దాం! పిల్లా.. రామసక్కని పిల్లా
మా రాయుడోరి బిడ్దా
>దండె రాంమ్మూర్తి(16.06.2011) (66.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి