"కన్న ఋణం"
నలుసు పడ్డది మొదలు
రక్త మాంసములు పంచి
నవ మాసములు మోసి
కని, పునర్జన్మించి.....
కంటికి రెప్పై
మేనుకు కవచమై
కాలికి చెప్పై
కాపాడి..
కోరికలన్నీ తీర్చి
కోరని వెన్నో అందించి
రెక్కల కష్టం చేసి
కడుపులు మాడ్చుకొని
పెంచి పెద్ద చేయగా.....
"ఏం చేసావ్?, ఏం ఇచ్చావ్?" అని
మాటలు తూటల పేల్చి
కన్న తల్లి కాయాన్ని
మళ్ల్ల్ల్లీ తూట్లుగ చేసి
కళ్ల నీరు నిండుకొనగ
దుఃఖ జ్యోతి కొండెక్కగ
ఎద సంద్రముగా మారగ
వయసుడిగిన
ముసలి తల్లి గుండె కోత..
ఆపు దిక్కులేక, తీర్చు జాడ లేక
నిరీక్షించి, నీరసించె
మాతృ మూర్తులెందరో.......
>దండె రాంమ్మూర్తి(05.05.2014) (65.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి