25, ఆగస్టు 2014, సోమవారం

నా పల్లె


నా పసి ప్రాయాన పల్లెలు చూడ ముచ్చటగుండేవి
దారులెంట పచ్చని చెట్లే పందిళ్ళ్లయ్యేవి
ఇరువైపులా నీటి చెలమలే చెలిమినిజేసేవి
చిలుకలు కొట్టిన మధుర ఫలములే విందుగ మారేవి
పలువిధ పక్షుల కిచ కిచ మోతలె చెవులకు సోకేవి
కుహు కుహు కోయిల కూతలె మనసుని మైమరపించేవి
గరిక పచ్చని నేలలె అంతట దర్శనమిచ్చేవి
ఆరుద్ర రంగవల్లులె కనులకు విందులు చేసేవి

నా యవ్వన ప్రాయము పల్లెలు చూడ కొత్తగ మారినవి
చెట్లని తుంచి, రోడ్లను పెంచి, అభివృద్ధే జరిగినది
చరవాణులు వచ్చి, ఖగవాణిని నొక్కి, ఆయువు తీసినవి
వరణుడి కరుణ లేక పల్లె నేలలు బీటలు వారినవి
మోడువారిన తరువులు ఎన్నో, మోడై పోయిన బ్రతుకులు ఎన్నో,
బక్క చిక్కినా పశువులు ఎన్నో, గుక్క పట్టినా పసి ఏడుపులెన్నో
పల్లెలొ జరిగిన అభివృద్ధిని సైతం వెక్కిరించినవి, కోపగించినవి


>దండె రాంమ్మూర్తి(11.06.2014) (77.                  






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్