25, ఆగస్టు 2014, సోమవారం

ప్రేయసి


నీ మోము చంద్ర బింబమని తలచి
వెన్నెల జాగారముంటి అమావాస్య వేళ

నీ విడి వడినా కురుల వెంట
వడి వడిగా నడ యాడి
బయమొందితి నిశి తలచి పౌర్ణమి వేళ

కలువలకే చీకటంటి
నయనములై పోయెనేమొ

సృష్ఠికర్తె చొరవ జేసి
కొఠారి ముక్కు దిద్దెనేమొ

గులాబి రేకులన్ని కలిసి
అధరములుగ మారెనేమొ

నెలవంకే దిగి వచ్చి
నడువొంపుగ ఒదిగెనేమొ

పాలసంద్ర నురగమల్లె
చిరునగువే మెరవంగ
ముద్దు ముత్యాలు రాల
మురిపముతోనేరుకుంటి

                           >దండె రాంమ్మూర్తి(06.08.2014) (76.                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu