మనసిచ్చినానే
మాటిచ్చినావే
మధువంపినావే
మత్తెక్కెనే!
చంద్రబింబ మోము
కమలాల కళ్ళ్లు
నెలవంక నవ్వు
పిచ్చెక్కెనే
ఓరకంట చూసి
చిరునగువిసిరి
చెలిమంటు జేసి
ఎడమైతివే
నిను నేను గెలిచి
నను నేను మరిచి
ప్రతి రోజు తలచి
ప్రేమిస్తినే
నీకై తపించి
నిన్నే జపించి
నిత్యం పూజించి
దు:ఖిస్తినే
దేహం నాకున్నా
మనసే నీదాయె
బ్రతుకే లేదాయె
చావే రాదాయె
నువు లేక నేలేనె
నిను మరచి మనలేనె
నిత్యం నా మనసే
రణ రంగమే
నిలువెల్ల గునపాల పోట్లు
బ్రతుకంత నువులేక పాట్లు
నిను వెతికి వెతికి పడ్డానగచాట్లు
కనిపించవే
చూపు విసిరి బాణం వలె
చెయ్యి ఊపి ఖడ్గం వలె
నగు చుందువు శక్తి మళ్ళ్లె
బళ్ళ్లెం నేకానే
నా ఎదనూయలజేసి
నా పసి మనసుతోటి
ఊపియాడిస్తినమ్మా
కరుణించవే
నీ అందమంతజూపి
ఆనందమందిస్తే
ఊహల్లో తేలియాడి
మోహిస్తినే
ఓర కంట నువ్ చూసిన
చూపులు చురకత్తులై
గాయపరిచె బాణాలై
ఎద చీల్చెనే
>దండె రాంమ్మూర్తి(06.08.2014) (75.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి