31, మే 2014, శనివారం

అప్సరస

ఏరులై పారెనా కన్నీళ్ల్లు
బీడు వారి పోయెనా కనుపాపలు
సంద్రమై పోయెనా మది ఈనాడు
కాలి భూడిదై పోయెనా ఙ్జాపకాలు
ఒంటరై పోయెనా లోకాన నేను
చిమ్మ చీకటై పోయెనా జీవితాలు
దూరమై పోయెనా సఖి నా తోడు
ఆవిరై పోయెనా ఆశయాలు          IIఏరులైII

తొలి చూపులు నిను చూసిన వేళలో
మరిచితినే నన్ను నేను ఈ లోకానా
ఇరు పలుకులు ఒకటైనా ఈ శుభవేళా
మాట మారె మనసు జారె నా చెలి పైనా
అందగత్తె లెందరున్న ఈ లోకానా
అప్సరసవు నీవె గాద నా హృదయానా
నాతోనే కలిసి తిరిగినాచోటులూ
మరువ లేని మరుపు రాని తీపి గురుతులూ
ముద్దులు మురిపాలు తీరినాచోటే
పవిత్ర పుణ్యక్షేత్రమాయె నాకే చెలి
నువ్వున్నా వేళ నాకు స్వర్గ ధామమూ
నువు లేని క్షణమే ఓ నరక ప్రాయమూ    IIఏరులైII

ఎటు చూసిన నీ రూపే
ఏం చేసిన నీ ధ్యాసే
ఎక్కడున్న నీ ఊహలె
ఏకాంతపు ఙ్జాపకాలె
సీతనొదిలినారాముడి
నిను విడిచిన ఈ ప్రియుడి
ఆవేదన చెప్పతరమ
ఈ వేదన తీరనలవ..    IIఏరులైII

                    >దండె రాంమ్మూర్తి(24.06.2011)                    (47.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu