31, మే 2014, శనివారం

తెలంగాణ

తెలంగాణ కై ప్రాణాలొదిలిన
అమరవీరులా నెత్తుటి ధారలు
ఏడు పాయలై పారెనా
గోదావరియై సాగెనా
తెలంగాణా నాయకులారా
నిద్రమత్తునే వీడండీ
రక్త ధారలే చూడండీ
ఆత్మఘోషలే వినరండీ
            IIతెలంగాణ కైII
తెలంగాణా విద్యాకుసుమాలు
పోరాటమె మా ఆరాటమని
విడిపోవుడె గని రాజీ లేదని
ప్రాణంబోయిన పర్వాలేదని
ఎత్తిన జెండా దించడమన్నది
ఒంట్లో ప్రాణం పోయినప్పుడని
ప్రాణం సైతం పణముగబెట్టి
ఉద్యమ రూపం తీవ్రం జేస్తే
నాయకులంతా మూకుమ్మడిగా
ఉద్యమాగ్నిలో నీళ్ల్లను జల్లి
చర్చలకంటూ డిల్లికిబాయె
శాంతి మంత్రముతొ ఇళ్ళ్లకి జేరె
            IIతెలంగాణ కైII
తెలంగాణ ఉధ్యోగార్ధులు
ఎస్మా గిస్మా జాంతానై అని
పాలననంతా స్తభ్ధం జేసి
రాకపోకలని బంధే జేసి
ప్రాణం బోయిన పనులు ముట్టమని
రాష్ట్ర సాధనకు పాటుబడ్తమని
వలస వాదులూ బెదిరి పొయేలా
ఉద్యమానికి ఊతమౌతమని
కేంద్రం దిగి వచ్చేవరకు
రాష్ట్రం మాకిచ్చేవరకు
రాష్ట్రమగ్నిగుండమైన
పాలనెంత పడావైన
భాద్యులు మీ నాయకులని
మరల మరల జెప్తున్నం
            IIతెలంగాణ కైII

                    >దండె రాంమ్మూర్తి(16.06.2011)                    (46.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu