31, మే 2014, శనివారం

చదువు తెలంగాణ

ఆంధ్ర పాలకులంత గూడి
తెలంగాణ పల్లె జిల్లలన్ని
చదువుకోక వెనకబడెనని
లెక్చరుమీద లెక్చర్లు దంచగ

పల్లె పల్లె యువకుసుమాలన్ని
నడుంగట్టి కృషి చేపట్టి
పట్టుదలతొ దీక్షగ జదివి
డిగ్రి పట్టలు చేత బూని
బతుకు దెరువుకు పట్నమొచ్చి
వలస వాదుల కంపనీలలో
పనుల కొరకు ప్రాకులాడితె
కూలి పనులు జేసుకోమని
చాలి చాలని జీతమిస్తూ

పై కొలువులు ఆంధ్ర వారికని
తెలంగాణపై వివక్ష చూపి
అణగ దొక్కి
అణిచి వేసి
ఆడుకుంటే..
ప్రాణ త్యాగం తప్ప మాకు
దిక్కు ఏదని వేడుకుంటే
రెచ్చగొడుతూ సంపుతుండ్రని
అపనిందలనే మోపుతుండ్రు

చదువులేక కూలిలైతే
తప్పు మాదే..
చదువు’కొన్నా’ కూలిలైతే
ఎవరి తప్పు..????

                >దండె రాంమ్మూర్తి(07.08.2011)                        (48.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్