ఓ చందురయ్య
గాడిదల్లే ఎదిగినాగని
పైసపాని లేకపాయే
గాణుగెడ్ల మళ్ళ్లె మేము
బతుకుబండి లాగుడాయె
కర్మఫలమని జాతకాలని
ఇంటిలోనా మెట్టవెడితే
ఇల్లు ఎట్లా గడుచునోరయ్యా - ఓ చందురయ్యా!
పైకమెట్లా వచ్చునోరయ్యా - ఓ చందురయ్యా!
IIగాడిదల్లేII
కష్టమంటూ ఎరగకుంటే
లోకమేంటో తెలియకుంటే
గమ్యమంటూ లేకుంటే
గమణమేంటో తెలియకుంటే
జీవితమ్ము ఎందుకోనంటా - ఓ చందురయ్యా!
జీవించుటెందుకింకంటా - ఓ చందురయ్యా!
IIగాడిదల్లేII
గడ్డిపరక మళ్ళ్లె నీకు
విలువ యేమి లేకపాయె
ఎముక లేని నాలుకల్లె
ఎటు బడితే అటే బోతివి
ఒక్క తోవను బట్టలేక
బతుకు సట్ట బండజేస్తివి
కొత్తదోవను జేసెడంత
ధైర్యమేమో లేకపాయె
గిట్ల జేస్తే నెట్ల నోరయ్యా - ఓ చందురయ్యా!
పేరు ఎట్లా నిల్చునోరయ్యా - ఓ చందురయ్యా!
IIగాడిదల్లేII
మంచిదోవా జూసుకోని
పయణమాటే సాగరయ్యా
ఆ దోవలోనే గమ్యముంటది
విజయపథమే జేరుతావు
దోవలోని ముళ్ళ్లు జూసి
వెనుదిరిగితె కుదరదయ్యా
ముళ్ళ్లనె నువ్ పూలు జేసి
అదిగమించితె విజయమేగా
విజయపంచులు చేరు మా అయ్య - ఓ చందురయ్యా!
దోవ విడవక పాటుపడవయ్యా - ఓ చందురయ్యా!
>దండె రాంమ్మూర్తి(14.06.2011) (45.
గాడిదల్లే ఎదిగినాగని
పైసపాని లేకపాయే
గాణుగెడ్ల మళ్ళ్లె మేము
బతుకుబండి లాగుడాయె
కర్మఫలమని జాతకాలని
ఇంటిలోనా మెట్టవెడితే
ఇల్లు ఎట్లా గడుచునోరయ్యా - ఓ చందురయ్యా!
పైకమెట్లా వచ్చునోరయ్యా - ఓ చందురయ్యా!
IIగాడిదల్లేII
కష్టమంటూ ఎరగకుంటే
లోకమేంటో తెలియకుంటే
గమ్యమంటూ లేకుంటే
గమణమేంటో తెలియకుంటే
జీవితమ్ము ఎందుకోనంటా - ఓ చందురయ్యా!
జీవించుటెందుకింకంటా - ఓ చందురయ్యా!
IIగాడిదల్లేII
గడ్డిపరక మళ్ళ్లె నీకు
విలువ యేమి లేకపాయె
ఎముక లేని నాలుకల్లె
ఎటు బడితే అటే బోతివి
ఒక్క తోవను బట్టలేక
బతుకు సట్ట బండజేస్తివి
కొత్తదోవను జేసెడంత
ధైర్యమేమో లేకపాయె
గిట్ల జేస్తే నెట్ల నోరయ్యా - ఓ చందురయ్యా!
పేరు ఎట్లా నిల్చునోరయ్యా - ఓ చందురయ్యా!
IIగాడిదల్లేII
మంచిదోవా జూసుకోని
పయణమాటే సాగరయ్యా
ఆ దోవలోనే గమ్యముంటది
విజయపథమే జేరుతావు
దోవలోని ముళ్ళ్లు జూసి
వెనుదిరిగితె కుదరదయ్యా
ముళ్ళ్లనె నువ్ పూలు జేసి
అదిగమించితె విజయమేగా
విజయపంచులు చేరు మా అయ్య - ఓ చందురయ్యా!
దోవ విడవక పాటుపడవయ్యా - ఓ చందురయ్యా!
>దండె రాంమ్మూర్తి(14.06.2011) (45.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి