31, మే 2014, శనివారం

తెలంగాణ

తెలంగాణ వాసనల్తొ
గులాబీలు బూసినై(2)
ఊరూరా కారులల్ల
ఊరికనే దిరిగినై(2)
గుమగుమలా తెలంగాణ
వాసనలే జూపినై(2)
డిల్లికెల్లిన గులాబీల
వాసనలే రాకపాయె
పూజకైన పనికిరాలె
            IIతెలంగాణII
యిగ జూడు మాది గూడ
తెలంగాణ వాసనంటు(2)
యిరగబూసె పూలన్ని
పలురకాల రంగులతో(2)
ఊర్లన్ని కలియదిరిగి
వాసనల్ని గుప్పించి(2)
తెలంగాణ సాధనకు
పూజలెన్నొ జేస్తమంటు(2)
డిల్లీకి పయణమాయె
పూలన్నీ ఒక్కాటయ్యి
సోనియమ్మ పూజకై(2)
            IIతెలంగాణII
డిల్లీలో పూలన్ని
వెదజల్లెను వాసనలే(2)
అధిష్టాన వ్యూహానికి
అదిరిపడే పూలన్ని(2)
ఏ వాసనొస్తె ఏం లాభం(2)
ఏ పూలు పనికిరాలె
అధిష్టాన పూజలకి
తెలంగాణ సాధనకి
శ్రీ కృష్ణ కమిటంటు
రెండవ ఎస్సార్సి అంటు
పార్టీలతొ చర్చలంటు
కాల్చవట్టె కాలాన్ని
తేల్చదాయె గాణాన్ని
        IIతెలంగాణII

                >దండె రాంమ్మూర్తి(24.05.2011)                        (44.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu