31, మే 2014, శనివారం

మా(నవా)రవా..

మనవా..
మారవా..
జయించవేం స్వార్ధం
చేధించవేం మనసు
కురిపించవేం అనురాగం
పంచవేం ఆత్మీయత
మార్చుకోవేం అభిమతం
విడవవేం అహం
చిందించవేం చిరునవ్వులు
రూపుమాపవేం కోపం
చూపించవేం కరుణ
వదిలించుకోవేం కర్కశత్వం

పాము విడుచు కుబుసం
హంస విడుచు జలము
చీమ విడుచు గృహము
ఆయువిడుచు దేహం

మార్పు సహజం ప్రయత్నిస్తే
మారగలవు దీక్ష చేస్తె
నువ్వు నువ్వుగా బతుకు
బోసి నవ్వుల సంతసం పొందు.

                                              >దండె రాంమ్మూర్తి(02.12.2010)                (14.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్