31, మే 2014, శనివారం

తొలిచూపు...

తొలి చూపుతొ అలజడి రేపి
తొలి పలుకుతొ మాధుర్యం చూపి
బాసలు ఆడి, ఊసులు కలిపి
మది ని తట్టగ, ప్రేమ పుట్టగ

జపము చేయ బూనినాను
నీ మదిలో గుట్టు ఎరుగ
సంద్రమడుగు తెలుసునేమొ
నీ లోన గుట్టు రట్టు గాదయె

ప్రీతి తెలుపు తెలుపు మంటు
ఎద మ్రోగి మ్రోగి తెలిపె
నే చూసి చూసి శకునాలని
తియ తీయని తీపి గురుతు

కావాలని...
అట్టి దినము కొరకు నేను
ఎదిరి చూస్తు ఎదిరి చూస్తు
కాల హరణ గావిస్తిని....

                                      >దండె రాంమ్మూర్తి(10.09.2008)                        (5.

1 కామెంట్‌:

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్