కపోతాలు
కోట గోడల నుండె నంట అందమైన మేడ
మేడ నుండెను కంపు గొట్టె గబ్బిలాల గాధ
గాధ వినుము అచ్చెరువొందును నీ ఎడద
ఎడద కరుగు నింటివంటె దేవుడి లీల
కోట లోనికి కొత్తగొచ్చెను కొంటెవీరుడు
కొదమ సింహమోలె తాను పౌరుషంబె చూపె
గబ్బిలాల కంపు స్థానె గంధ వాసనలీచె
గబ్బిల రూపె మారి కపోతాలై స్వేచ్చ నొందె
ఇంత చేసినా వీరుడి గాథేంటో, బాధలేంటో
తెల్పడేదేమైనా తడపడు కనుపాపైనా
నివురుగప్పిన్నిప్పల్లె వెలుగున్ సంతసమె
తన ఎదనిండా ఎదుటి వారి మదినిండా
స్వార్దపరులు చుట్టున్నా స్వార్ధమెరుగని మ
నీషి, కల్మషాలు ఎన్నున్నా కంటు గాని కరు
ణ నీది, దైవాంశ ను నింపుకున్న రాముడల్లె
చేజారే మురిపాలను బంధించి అందింతువు
పసిపాపల తేనె మనసు మలిన పర్చు
కసాయి మాటలకు కన్న తండ్రి జడిసేనా...?
ఆనందపు సాగరాల్ని ఎండగట్టి పోతావా..?
స్వేచ్చా కపోతములని బంధించి వెడతావా...?
>దండె రాంమ్మూర్తి(28.01.2014) (61.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి