31, మే 2014, శనివారం

ముసలి తండ్రి

ఆదివారము సెలవుదినమని
భార్యపిల్లలు వెంటరాగా
పట్నమందము చూడగోరి
రోడ్డు వెంట నడక సాగగ

కాస్లి కారులు
రేసు బైకులు
ఫాన్సి డ్రెస్సులు
యువత సోకులు

అక్రమాస్తులు కూడబెడుతూ
సరస సరదాలనుభవిస్తూ
డబ్బు నీళ్ళ్లుగ ఖర్చుబెట్టే
ధనికులున్నా పట్టణాన..

చిరుగుదుస్తులు వేసుకోని
కడుపు లోన కూడు లేక
ఒంట్లొ శక్తి అసలు లేక
రోడ్డు మీద పోతు పోతూ
నడవ లేక తూళుకుంటూ
కింద పడుతూ పైకి లేస్తూ
ఒంటి నిండా గాట్లు ఉన్నా
వెలికి వచ్చే నెత్తురు లేక
నడిచి పోయే సత్తువ లేక
రోడ్డు పక్కన చెట్టు కింద
కళ్ళ్లు తిరిగి కింద పడగ
ఈగ దోమలు ఒంటి మీద
వాలిపోయి కుశలమడిగెను
దిక్కు లేక ధీన స్థితిలో
చావు బతుకుల
మధ్యనున్నది    (25.09.2011)
ఎవరొ కాదది       
దుష్థ పుత్రుల దుర్మార్గానికి
రోడ్డు పాలైన ముసలి తండ్రి  (04.09.2011)

                        >దండె రాంమ్మూర్తి                        (52.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్