31, మే 2014, శనివారం

నేస్తం

మందు లేకుండానే మత్తెక్కుతోంది
    స్నేహ సరిగమలు వీస్తున్నపుడు
కాలం తనంత తానే కరిగిపోతుంది
    ప్రియ నేస్తం చెంత నే చేరినపుడు
ప్రకృతి అందం కనుమరుగౌతోంది
    నీ మనస్సౌంధైర్యం పలకరించినపుడు
**        **        **        **
నేస్తమా నాలో నేను లేను
    నాలో నీకై వేచి చూస్తూ
నన్ను నేనే మరిచా
    నువు మరుపు రాకూడదని
నీ స్నేహం కావాలి నాకు
    మరణం వరకు తోడు
ఉండలేవా చెప్పు నేస్తం
    చావుకైనా సిద్దం నీ నేస్తం
**        **        **        **
నా మనసు కకావికలమౌతోంది
    నీ తోడు నే వీడినపుడు
నా శ్వాస ఆగిపోతుంది
    నీ స్నేహం నాకు దూరమైనపుడు

                        >దండె రాంమ్మూర్తి(21.09.2011)                   (53.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu