ఎదురుచూపు
నా ఎదురు చూపులెందుకో
నీ రాకకై వేచి వేచి
నీతో గడిపినా క్షణాలు
నా జీవిత మధురాలు
నువు లేక క్షణమైన
నిలువదు నా మనసు
నీ పలుకులు నాకానందం
నీ మనసే ఓ మకరంధం
ఏముందే నీ మాటల్లో
మాటలో మరి మంత్రాలో
మాయలేడివో మాయలాడివో
** ** **
మాటల తూటాలు పేల్చి
మనసు గాయపరిచే
మగువలున్న ఈ లోకానా..
** ** **
మాటల ముత్యాలు రాల్చి
మనసున మలినము తుడిచే
తెల్లని మల్లెగ మార్చే
బాధలు, భయాలు పోయే
విజయపు బాటలు పరిచే
మహిమలున్న దేవకన్య
వెంట నంటి ఉంటె...
** ** **
సెలయేటి అలలపై
తేలియాడుతున్నట్టు
సాగేటి నావపై
పయనమెళుతున్నట్టు
నిండు పున్నమి, వెండి చందురుని
వీక్షిస్తున్నట్టు
వేల వేల చుక్కల్ని లెక్కిస్తు
నిదురిస్తున్నట్టు
లెక్కలేని ఆనందపుటంచులు
తాకి మైమరిచి
మధురమైన మరుపులేని
మరో ప్రపంచం చూస్తూ..
** ** **
తను విడిచిన క్షణమైనా
గుండె కోసె రంపంలా
ఆయువు తీసె పాశంలా
వెంటాడీ వేధిస్తూ
వేయి త్రాచులు కుట్టినట్టు
వేధననే అనుభవిస్తు
ఎన్నో భయభ్రాంతులు
ఆ క్షణమునే కలుగు నాకు
** ** **
ఓ ముత్యపు మాటల నేస్తం
జాగ్రత్త...!
ముద్దొచ్చే పావురాన్ని
వలవేసి వేధించే
వేటగాళ్ళ్లు ఉంటారు
కాపు గాసి బంధించే
కసాయిలు ఉంటారు
కనుక నేస్తం...
నువు వదిలే ఆ రత్నాలు
కాస్త గమనిస్తూ జారవిడు..
>దండె రాంమ్మూర్తి(06.10.2012) (57.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి